Fact Check: 1990 నుంచి 2021 వరకు ఉద్యోగం చేసిన వారికి ప్రభుత్వం 1 లక్షా 55 వేల రూపాయలు ఇస్తుందా..? పీఐబీ ఏం చెప్పింది..

|

Jun 06, 2022 | 3:26 PM

1990 నుంచి 2021 సంవత్సరాల మధ్య పనిచేసిన ఉద్యోగులకు ప్రభుత్వం భారీ మొత్తాన్ని ఇవ్వబోతోందని ఓ సందేశం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతుంది...

Fact Check: 1990 నుంచి 2021 వరకు ఉద్యోగం చేసిన వారికి ప్రభుత్వం 1 లక్షా 55 వేల రూపాయలు ఇస్తుందా..? పీఐబీ ఏం చెప్పింది..
Interest
Follow us on

1990 నుంచి 2021 సంవత్సరాల మధ్య పనిచేసిన ఉద్యోగులకు ప్రభుత్వం భారీ మొత్తాన్ని ఇవ్వబోతోందని ఓ సందేశం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఈ సందేశంలో కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ 1990, 2021 మధ్య పనిచేసిన ఉద్యోగులు రూ. 1,55,000 పొందేందుకు అర్హులని ఉంది. దీనిపై ప్రభుత్వ సమాచార ఏజెన్సీ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ( PIB ) స్పందించింది. వైరల్ అవుతున్న ఈ సందేశంపై ఓ ట్వీట్‌ చేసింది. ఈ మెసేజ్ ఫేక్ అని పీఐబీ తెలిపింది. ప్రభుత్వం ఎలాంటి ప్రయోజనాలను ప్రకటించలేదని స్పష్టం చేసింది. PIB ఫాక్ట్ చెక్ తన ట్వీట్‌లో ఇలా రాసింది, ‘ఒక వైరల్ సందేశంలో కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ పేరుతో 1990 నుంచి 2021 మధ్య పనిచేస్తున్న ఉద్యోగులకు రూ. 1,55,000 ప్రయోజనాలను అందజేస్తామని పేర్కొంది. ఈ సందేశం పూర్తిగా ఫేక్, అలాంటి ప్రకటన ఏదీ మంత్రిత్వ శాఖ చేయలేదు. ఇలాంటి మోసగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి’ అని సూచించింది.