కోవిద్ పై పోరులో హెల్త్ కేర్ వర్కర్ల అకుంఠిత దీక్ష, సాహసం చెప్పనలవి కాదు.. ఎన్ని ప్రతికూల పరిస్థితులనైనా తట్టుకుని విధి నిర్వహణ పట్ల తమ నిబద్ధతను చాటుకుంటూనే ఉంటారు. అతి శీతల వాతావరణంలో లడఖ్ లోని హెల్త్ కేర్ సిబ్బంది ఎర్త్ మూవర్ (జేసీబీ) లో నదిని దాటుతున్న ఫోటోను అక్కడి ఎంపీ జామ్ యాంగ్ సెరింగ్ నాంగ్యాల్ తన ట్విటర్ లో షేర్ చేశారు. లడఖ్ లోని సుదూర గ్రామీణ ప్రాంతాలకు వెళ్లేందుకు వీరు ఇంత సాహసానికి ఒడిగట్టారని ఆయన పేర్కొన్నారు. ఈ నలుగురిలో ఇద్దరు పీపీఈ కిట్లు ధరించి ఉన్నారని, డ్యూటీ పట్ల వీరి దీక్ష అద్భుతం..అమోఘమని ఆ ఎంపీ ప్రశంసించారు. సెల్యూట్ టు అవర్ కోవిద్ వారియర్స్ అని ట్వీట్ చేశారు. వీరి సేవలు అనిర్వచనీయం అని పేర్కొన్నారు. ప్రమాదకరమైన నదిని ఎర్త్ మూవర్ లో దాటడం ప్రాణాలకు తెగించడమే అని ఈ ఫోటోను చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతూనే వారిని అభినందనలతో ముంచెత్తారు. ఈ ఫొటోకు వెయ్యికి పైగా రీట్వీట్లు వచ్చ్చాయి.
లడఖ్ లో ఇప్పుడు వాతావరణం కూడా ప్రమాదకరంగానే ఉంది. ఎప్పుడు కొండ చరియలు విరిగి పడతాయో.. నదులు ఒక్కసారిగా పొంగి ప్రవహిస్తాయో తెలియదు.అయినా వీరు చలించలేదు..గ్రామీణులకు వ్యాక్సిన్ వేసేందుకు ఇలా నదిని దాటుతున్నారు.మరోవైపు చైనా దళాలు నియంత్రణ రేఖ వద్ద పొంచి ఉన్నాయని వార్తలు కూడా వస్తున్నాయి.
మరిన్ని ఇక్కడ చూడండి: ప్రకృతి ఒడిలో రాశీ ఖన్నా..పచ్చని పొదల మధ్య ఒదిగి ఉన్న భామ.నెట్టింట వైరల్ గా మారిన వీడియో..
హనుమాన్ జయంతి నాడే అనంతపురం జిల్లా పుట్టపర్తిలో వెలుగుచూసిన మహా అద్భుతం.:Viral Video.
తెలుగు రాష్ట్రాల్లో ఆనందయ్య లు ఎంతమంది?ఊరుకోక ఆనందయ్య అనుచరులమంటూ మందు తయారీ..Viral Video.