అభ్యాసం కూసువిద్య.. సామెత వినే ఉంటారు. ఏదైనా ఒక పనిని నిరంతరం సాధన చేస్తే కొంతకాలానికి ఆ పనిలో ప్రావిణ్యం సాధించవచ్చని దాని అర్ధం. డ్రాయింగ్, ఆటలు, సంగీతం, స్టడీస్, కొత్త భాష.. ఇలా ఏదైనా ఒక విషయంపై నిరంతరం సాధన చేస్తే కొంతకాలానికి అందులో చేయి తిరిగిన నిష్ణాతులవుతారు. మనలో చాలా మంది వృత్తి రిత్యా లేదా సొంతంగా ఇంట్లో కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్ వాడుతూ ఉంటారు. కంప్యూటర్ కీబోర్డును కొత్త మంది చాలా నిదానంగా టైప్ చేస్తే.. మరికొందరేమో రోజూ అదేపని చేయడం వల్ల మెరుపువేగంతో టైప్ చేస్తుంటారు. కీ బోర్డుపై వారి చేతి వేళ్లు మెరుపు వేగంతో పరుగులు తీస్తుంటాయి. తాజాగా ఓ ఫార్మసీ షాపులో బిల్లిల చెల్లింపుల వివరాలు కంప్యూటర్‌లో నమోదు చేసే వ్యక్తి పనితనాన్ని చూసి నెటిజన్లు ‘వావ్..’ అనకుండా ఉండలేకపోతున్నారు. నమ్మలేకపోతున్నారా? ఐతే మీరూ ఈ వీడియో చూసేయండి..
బిల్లింగ్ కౌంటర్‌లో ఫార్మసీ సిబ్బంది కస్టమర్లకు మెడిసిన్ ఇవ్వడం ఈ వీడియోలో కనిపిస్తుంది. ఐతే వారిలో ఓ వ్యక్తి మందుల వివరాలు కంప్యూటర్‌లో నమోదు చేస్తుంటాడు. ఇక్కడే అందరి దృష్టి అతను ఆకర్షించాడు. కస్టమర్లతో బిజీగా ఉన్న ఫార్మసీ షాపులో రిసెప్షనిస్ట్ కస్టమర్‌ల బిల్లింగ్ వివరాలను కనీసం కంప్యూటర్ వైపు చూడకుండానే క్షణాల్లో సిస్టమ్‌లో నమోదు చేసి బిల్లింగ్ పూర్తి చేయడం వీడియోలో కనిపిస్తుంది. దీనికి సంబంధించిన వీడియోను ‘ఇతను ఇండియాలో బిజీగా ఉన్న ఫార్మసీలో పనిచేస్తున్న రిసెప్షనిస్ట్’ అనే క్యాప్షన్‌తో సీసీటీవీ ఇడియట్స్ అనే యూజర్ ట్విటర్‌లో పోస్టు చేశారు. అంతే క్షణాల్లో మిలియన్ల కొద్ది వీక్షణలు, లైకులు రావడంతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మీరేమంటారు..
This receptionist at a busy pharmacy in India. pic.twitter.com/lYk80QQGav
— CCTV IDIOTS (@cctvidiots) April 13, 2023
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.