అహ్మదాబాద్‌లో ప్రవాసీ గుజరాతీ పర్వ్ – 2022 వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ రోజు నుంచి మూడు రోజులపాటు జరగనున్న గుజరాతీ పర్వ్ వేడుకలను దేశంలోని నంబర్ 1 న్యూస్ నెట్‌వర్క్ TV9, అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ అమెరికన్స్ ఇన్ నార్త్ అమెరికా (AIANA) నిర్వహిస్తున్నాయి. అదానీ, టీవీ9 నెట్‌వర్క్, ఎంఈఐల్, ఏఐఎఎన్ఏ ఆధ్వర్యంలో జరుగుతున్న గుజరాతీ పర్వ్-2022 కార్యక్రమంలో 20 దేశాలకు పైగా ప్రతినిధులు, 18 రాష్ట్రాల నుంచి సుమారు 2,500 మంది గుజరాతీలు పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమానికి తొలుత కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. అనంతరం టీవీ9 నెట్‌వర్క్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో బరుణ్ దాస్ (TV9 Network MD & CEO Barun Das) ప్రసంగించారు.
మహాత్మా గాంధీ – సర్దార్ పటేల్ లాంటి ధీరులు పుట్టిన గడ్డ గుజరాత్: బరున్ దాస్
గుజరాతీ పర్వ్ – 2022 వేడుకల సందర్భంగా TV9 నెట్‌వర్క్ MD, CEO బరున్ దాస్ స్వాగత ప్రసంగం చేస్తూ.. గుజరాతీలందరికీ ధన్యవాదాలు తెలిపారు.. గుజరాతీలందరూ విదేశీ పర్యాటకులకు రాయబారులు అంటూ కొనియాడారు. ఇది మహాత్మా గాంధీ, సర్దార్ పటేల్ లాంటి గొప్పనాయకులు పుట్టిన భూమి అని కొనియాడారు. అలాగే.. గుజరాతీ గడ్డపై పుట్టిన ప్రధాని నరేంద్ర మోదీ, విదేశాంగ మంత్రి జైశంకర్.. దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారంటూ కొనియాడారు. పారిశ్రామిక రంగంలోనూ గుజరాతీలు అగ్రపథంలో దూసుకెళ్తూ దేశాభివృద్ధిలో ప్రముఖపాత్ర పోషిస్తున్నారని తెలిపారు.
టీవీ9 ప్లాట్‌ఫామ్ ద్వారా నిర్వహించిన 20కి పైగా దేశాల ఆహ్వానాల ద్వారా గుజరాత్ నుంచి ప్రపంచానికి ప్రపంచ సందేశాన్ని అందిస్తున్నట్లు బరున్ దాస్ తెలిపారు. మిషన్.. 2047 పూర్తి అభివృద్ధి చెందిన భారతదేశంగా ఉండాలనే ప్రధాని మోడీ కలను సాకారం చేసేందుకు ఇదొక తోడ్పాటు అని తెలిపారు. నవ భారతం.. అత్మనిర్భర్ భారత్ కల సాకారం అయ్యేలా భారత్ ముందుకుసాగుతుందన్నారు. దీనికి ఉదహరణగా పలు అంశాలను వివరించారు.
ఎస్. జైశంకర్ సమర్‌కండ్‌లో జరిగిన షాంఘై సమ్మిట్‌లో.. ప్రధాని మోడీ సూచనల మేరకు.. రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు యుద్ధం కాకుండా చర్చల మార్గాన్ని సూచించారన్నారు. దీనిద్వారా ప్రధాని మోడీ భారతదేశం ప్రాముఖ్యతను ప్రపంచం ముందు ఉంచారన్నారు. భారత్ హక్కులు.. ప్రజాస్వామ్యం గురించి పలు అంశాలతో కూడిన సందేశాన్ని ప్రపంచం ముందు చాలా స్పష్టంగా గొంతెత్తిందని తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం..