Toolkit Case: టూల్ కిట్ కేసులో బయటపడిన మరో పేరు, సూత్రధారిగా భావిస్తున్న పోలీసులు, ఖండించిన విదేశీయుడు

| Edited By: Pardhasaradhi Peri

Feb 17, 2021 | 11:51 AM

టూల్ కిట్ కేసులో మరోపేరు బయటపడింది. పీటర్ ఫ్రీడ్ రిచ్ అనే వ్యక్తే ఈ కేసులో మాస్టర్ మైండ్ గా ఢిల్లీ పోలీసులు భావిస్తున్నారు. ఖలిస్థాన్ ను ఏర్పాటు చేయాలని..

Toolkit Case: టూల్ కిట్ కేసులో బయటపడిన మరో పేరు, సూత్రధారిగా భావిస్తున్న పోలీసులు, ఖండించిన విదేశీయుడు
Follow us on

టూల్ కిట్ కేసులో మరోపేరు బయటపడింది. పీటర్ ఫ్రీడ్ రిచ్ అనే వ్యక్తే ఈ కేసులో మాస్టర్ మైండ్ గా ఢిల్లీ పోలీసులు భావిస్తున్నారు. ఖలిస్థాన్ ను ఏర్పాటు చేయాలని  డిమాండ్ చేసిన భజన్ సింగ్ భిందర్ అనే కరడు  గట్టిన ఖలిస్తానీతో ఇతనికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని భావిస్తున్నారు. 2006 నుంచే పోలీసులు పీటర్ కోసం గాలిస్తున్నారు. భజన్ సింగ్ తో కలిసి పీటర్ ఖలిస్తానీ ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తూ వచ్చాడట. జనవరి 26 న ఢిల్లీ ఎర్రకోట వద్ద జరిగిన అల్లర్లతో కూడా పీటర్ కు సంబంధం ఉందని పోలీసులు వెల్లడించారు. అయితే ఈయన మాత్రం ఖలిస్తానీ ఉద్యమంతో తనకు సంబంధం లేదని, తన పేరును అన్యాయంగా ఎఫ్ ఐ ఆర్ లో పోలీసులు చేర్చారని అంటున్నాడు. భజన్ సింగ్ తో కలిసి నేను రెండు పుస్తకాలు రాశాను.. కుల వ్యతిరేక పోరాటానికి, సిక్కిజానికి మధ్య ఉన్న లింక్ పై మేము ఈ బుక్స్ రాశాం తప్ప అసలు టూల్ కిట్ కేసుతో నాకేమిటి సంబంధం అని పీటర్ అంటున్నాడు.

ఇండియాలో మానవహక్కుల సమస్యలకు శాంతియుత పరిష్కారాలు కనుగొనాలని తాను భావిస్తున్నట్టు పీటర్ చెప్పాడు. పంజాబ్, కాశ్మీర్ రాష్ట్రాల్లో మానవహక్కుల ఉల్లంఘన జరుగుతోందని చెబుతున్న ఇతగాడు.. టూల్ కిట్ కేసులో మీడియా తనను విలన్ గా చూస్తోందని ఆరోపించాడు. ఇండియాలో నిరసన చేస్తున్న రైతులకు టూల్ కిట్ అన్నది తోడ్పడితే అది గౌరవప్రదమే అని వ్యాఖ్యానించాడు. ఖలిస్థాన్ ఉద్యమంలో తను చేరలేదని చెబుతున్న పీటర్ డొంక తిరుగుడు మాటలను పోలీసులు నమ్మడంలేదు.

కాగా టూల్ కిట్ కేసులో క్లైమేట్ ఛేంజ్ యాక్టివిస్ట్ దిశారవి, శంతను ములుక్, నిఖితా జాకబ్ లను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.

 

Also Read:

IOCL Recruitment 2021:ఇంటర్ నుంచి ఇంజనీర్ వరకు అభ్యర్థులను ఉద్యోగాలకు ఆహ్వానిస్తున్న ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్

Paneer Benefits: చర్మం ముడతలు పడుతుందా..? అయితే మీరు ఈ ఐటంను తినడం లేదని అర్థం.. ఏంటో తెలుసా..