IOCL Recruitment 2021:ఇంటర్ నుంచి ఇంజనీర్ వరకు అభ్యర్థులను ఉద్యోగాలకు ఆహ్వానిస్తున్న ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్
ప్రముఖ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సంస్థ మరోసారి నిరుద్యోగులకు శుభవార్తను వినిపించింది. గత కొన్ని రోజులుగా వరసగా ఉద్యోగాల భర్తీకోసం నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తోన్న ఈ సంస్థ మళ్ళీ తాజాగా నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. 885 ఉద్యోగాలను..
IOCL Recruitment 2021: ప్రముఖ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సంస్థ మరోసారి నిరుద్యోగులకు శుభవార్తను వినిపించింది. గత కొన్ని రోజులుగా వరసగా ఉద్యోగాల భర్తీకోసం నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తోన్న ఈ సంస్థ మళ్ళీ తాజాగా నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. 885 ఉద్యోగాలను భర్తీ చేయనున్నామని ప్రకటించింది. టెక్నీకల్, నాన్ టెక్నీకల్ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయడానికి అర్హులైన అభ్యర్థులనుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.
ఈ 885 ఉద్యోగాల్లో కొన్ని తాత్కాలిక ప్రాతిపదికన, మరొకొన్ని పర్మినెంట్ విభాగాల్లో ఉన్నాయి. ఈ ఖాళీల భర్తీకి మొత్తం ముడు నోటిఫికేషన్లు విడుదల చేశారు. ఇక ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.1.05 లక్షల వరకూ వేతనం చెల్లించనున్నారు. ఇక అప్రంటీస్ ట్రైనీ విభాగంలో ఎంపికైన అభ్యర్థులకు చట్ట ప్రకారం వేతనం చెల్లించనున్నారు.
దరఖాస్తు వివరాల్లోకివెళ్తే..
ఇంజనీర్, టెక్నీషియన్ విభాగాల్లో ఖాళీల భర్తీకి వేర్వేరుగా నోటిఫికేషన్లను రిలీజ్ చేశారు. వాటిల్లో 16 జూ. ఇంజనీర్ అసిస్టెంట్స్ , మరో 869 టెక్నీకల్ , నాన్ టెక్నీకల్ అప్రెంటిస్ ఖాళీలున్నాయి.
జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ విభాగంలో 16 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు కెమికల్ ఇంజనీరింగ్ లో మూడేళ్ల డిప్లొమా, రిఫైనరీ , పెట్రోకెమికల్ ఇంజనీరింగ్ చేసినవారు అర్హులు..
అంతేకాదు.. మాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో బీఎస్సీ చేసిన వారు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు 50 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 45 శాతం మార్కులను అర్హతగా నిర్ణయించారు. ఈ పోస్టులకు అప్లై చేయాలనుకున్న అభ్యర్థులు ఫిబ్రవరి 19లోగా అప్లై చేయాల్సి ఉంటుంది. పూర్తి వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.
ఉద్యోగానికి అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేయాలనుకుంటే లింక్ లను క్లిక్ చేయండి : Notification-Direct Link
*ఇక ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లో 869 టెక్నీకల్, నాన్ టెక్నికల్ అప్రెంటీస్ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఇన్స్ట్రుమెంటేషన్, మెకానిక్, మెషినిస్ట్ తదితర విభాగాల్లో ఐటీఐ చేసి ఉండాలి.
*మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్ , సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, తదితర విభాగాల్లో డిప్లమో చేసిన వారి కోసం కొన్ని పోస్టులున్నాయి.
*ఇంటర్ పాసై డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్ విభాగంలో స్కిల్ సర్టిఫికెట్ పొంది ఉన్న వారి కోసం మరి కొన్న పోస్టులు ఉన్నాయి. ఇందులో తూర్పు, పశ్చిమ రీజియన్లలో ఖాళీల కోసం వేర్వేరుగా అభ్యర్థుల నుంచి అప్లికేషన్లు ఆహ్వానిస్తున్నారు.
ఉద్యోగానికి అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేయాలనుకుంటే కింది లింక్ లను క్లిక్ చేయండి:
Notification1-Direct Link Notification2-Direct Link
Also Read: