AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Paneer Benefits: చర్మం ముడతలు పడుతుందా..? అయితే మీరు ఈ ఐటంను తినడం లేదని అర్థం.. ఏంటో తెలుసా..

Paneer Benefits: మీకు చర్మం ముడతలు పడుతుందా.. ఎముకలు, దంతాల సమస్యలతో బాధపడుతున్నారా.. అయితే మీరు ఈ ఐటంను రోజువారి ఆహారంలో

Paneer Benefits: చర్మం ముడతలు పడుతుందా..? అయితే మీరు ఈ ఐటంను తినడం లేదని అర్థం.. ఏంటో తెలుసా..
uppula Raju
|

Updated on: Feb 17, 2021 | 10:58 AM

Share

Paneer Benefits: మీకు చర్మం ముడతలు పడుతుందా.. ఎముకలు, దంతాల సమస్యలతో బాధపడుతున్నారా.. అయితే మీరు ఈ ఐటంను రోజువారి ఆహారంలో వాడటంలేదని తెలుస్తోంది. ఏంటంటరా అదేనండి పన్నీరు.. పాల నుంచి తయారయ్యే పన్నీర్‌లో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇదివరకు ఆహారంలో పన్నీరు పదార్ధాన్ని తక్కువగా తీసుకునేవారు. అయితే ఇప్పుడు వస్తున్న కొత్త కొత్త ఆహార పదార్థాల్లో చాలామంది పన్నీరు తీసుకోవడం పరిపాటి అయింది. మాంసాహారులకు చికెన్ ఎలాగో శాకాహారులు పన్నీర్‌ను అలా ఇష్టపడుతుంటారు.

పన్నీర్‌లో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఇది పూర్తి క్రీమ్ పాలు నుంచి వచ్చినట్లయితే, ప్రోటీన్ ఎక్కువగా ఉండటంతో పాటు కొవ్వు కూడా అధికంగా ఉంటుంది. పన్నీర్‌లో ఇనుము తప్ప దాదాపు శరీరానికి అవసరమైన ఖనిజాలు లభిస్తాయి. అలాగే పన్నీర్‌లో కాల్షియం, మెగ్నీషియం ఉంటాయి. పన్నీర్‌లో కాల్షియం అధికంగా ఉండడంతో ఎముకలు, దంతాలను బలోపేతం చేస్తుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో తోడ్పడుతుంది. పచ్చిగా ఉండే పన్నీరు ఆహారంగా తీసుకోవడం ద్వారా ఎముకలకు ఎంతో బలం చేకూర్చుతుంది. అలాగే కీళ్ల నొప్పులు ఉన్నవారికి ఎంతో మేలు కలుగుతుందని నిపుణులు తెలుపుతున్నారు.

పన్నీర్‌లోని పీచుపదార్థం జీవక్రియను పెంచి బరువు తగ్గటంలో తోడ్పడుతుంది. వీటిలో ఉండే ప్రొటీన్, మంచి కొవ్వులు ఎదిగే పిల్లలకు పోషకాలందించి వారి రోగనిరోధకశక్తిని పెంచుతుంది. పన్నీర్‌లో విటమిన్ బి, ఒమెగా-3 మరియు 6 ఫ్యాటీ యాసిడ్లు, యాంటి ఆక్సిడెంట్లు ఉంటాయి. దీంతో జుట్టుకి, చర్మానికి మంచిది. చర్మం ముడతలు పడకుండా, వాపు కలిగించే డెర్మటైటిస్‌ను ఆపడానికి పన్నీర్ సహయపడుతుంది. దీనిలో ఉండే బి-కాంప్లెక్స్ విటమిన్ గర్భిణీ స్త్రీలకు చాలా అవసరమని వైద్యులు సూచిస్తున్నారు.

ఏపీ పంచాయతీ ఎన్నికల లైవ్ అప్‌డేట్స్  దిగువన చూడండి..