
గుజరాత్‌లోని అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టు సమీపంలో ఎయిర్ ఇండియా AI171 విమానం కుప్పకూలి 200 మందికిపైగా ప్రయాణికులు మరణించడం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. అయితే అయితే ఈ ప్రమాద ఘటన మరువక ముందే దుబాయ్ నుంచి జైపూర్‌కు వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తడం తీవ్ర కలకలం రేపింది. ప్రయాణికులు ఎక్స్‌లో పోస్ట్ చేసిన వీడియో ప్రకారం..జూన్ 13న దుబాయ్ ఎయిర్ పోర్టు నుంచి రాజస్థాన్‌లోని జైపూర్‌కు రావాల్సిన ఎయిరిండియా IX 196 ఎక్స్‌ప్రెస్ విమానం సాంకేతిక లోపం కారణంగా ఐదు గంటలు ఆలస్యంగా బయల్దేరింది.అయితే ఆ ఐదు గంటల సేపు విమానంలో సాంకేతిక సమస్య కారణంగా ఏసీలు పనిచేయలేదు. దీంతో విమానంలో ప్రయాణికులు తీవ్ర ఉక్కపోతతో నరకం చూశామని ఆరోపించారు.
అయితే అత్యంత వేడి ప్రదేశమైన దుబాయ్ ఎయిర్ పోర్టులో విమానం ఆగిపోవడం, విమానంలో ఏసీలు పనిచేయక పోవడంతో సుమారు ఐదు గంటల పాటు విమానంలోని ప్రయాణికులు ఉక్కపోతతో నరకం చూశారు. అయితే తాము విమానంలోని క్రూ బటన్‌ను ప్రెస్ చేసి సమాచారం ఇచ్చినా కూడా విమానంలోని సిబ్బంది ఎవరూ స్పందించలేదని ప్రయాణికులు ఆరోపించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలను తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రయాణికులు షేర్ చేసిన వీడియోలలో వృద్ధులు, పిల్లలతో సహా అందరూ ఉక్కపోతతో చెమటలు పట్టి కనిపించారు. ఈ వీడియోను చూస్తే ఫ్లైట్‌లో ఏసీలు పనిచేయడం లేదని స్పష్టంగా అర్థమవుతోంది.
Aarzoo Sethi, a dietician and nutrition consultant has alleged that passengers on #AirIndia Express Flight IX196 from Jaipur to Dubai were left stranded on the aircraft for over five hours — without air conditioning, communication, or any assistance from the crew. pic.twitter.com/a6e03fmNT7
— Archit Gupta (@architguptalive) June 14, 2025
అయితే రాత్రి 7.25 గంటలకు బయలుదేరాల్సిన విమానం, అర్ధరాత్రి 12.45 గంటలకు బయలుదేరడంతో ఎయిర్ ఇండియా విమాన సిబ్బందిపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్లైట్ ఆలస్యం అయినా పరవాలేదు.. విమానంలో ఎసీలు కూడా పనిచేయకపోవడం ఏంటని మండిపడ్డారు..ఉక్కపోత, వేడి కారణంగా ఫ్లైట్‌లోని కొందరు వృద్ధుల ఆరోగ్య పరిస్థితి క్షీణించిందని ప్రయాణికులు ఆరోపించారు. విమానంలోని సిబ్బంది ఎంత పిలిచినా స్పందించకపోవడంతో పాటు కనీసం ప్రయాణికులకు నీరు కూడా అందించలేదని తెలిపారు.అయితే ఈ సాంకేతిక లోపంపై ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ మాత్రం ఇంత వరకు ఎలాంటి ప్రకటన చేయనట్టు తెలుస్తోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..