
భారత ప్రజా స్వామ్యానికి కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలని రాజ్యసభలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ డిమాండ్ చేశారు. భారత ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఓ ప్రతిపక్ష నేత విదేశాలకు వెళ్లి భారత న్యాయవ్యవస్థను, సైన్యాన్ని, ఎన్నికల సంఘాన్ని, సభను అవమానించారని పీయూష్ గోయల్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేత తప్పుడు ఆరోపణలు చేశారని.. ఆయన సభకు వచ్చి దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి. దేశంలో ఎమర్జెన్సీ విధించినప్పుడు ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఏర్పడిందని పీయూష్ గోయల్ ఎమర్జెన్సీని ప్రస్తావిస్తూ అన్నారు. రాహుల్ గాంధీపై బీజేపీ నేత దాడి చేయడంతో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కల్పించారు. ఈ సభలో సభ్యుడు కాని వ్యక్తిపై వ్యాఖ్యానించడాన్ని తప్పుపట్టారు ఖర్గే.
లండన్‌లో రాహుల్ గాంధీ చేసిన ప్రకటనపై భారతీయ జనతా పార్టీ పార్లమెంటులో ప్రతిపక్ష కాంగ్రెస్‌పై దుమ్మెత్తిపోసింది. రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలంటూ బీజేపీ ఎంపీలు పార్లమెంట్ ఉభయ సభల్లో రచ్చ సృష్టించారు. లోక్‌సభలో బీజేపీ చర్య కారణంగా సభా కార్యకలాపాలు సాగలేదు. గందరగోళం కారణంగా లోక్‌సభ కార్యకలాపాలను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేయాల్సి వచ్చింది.
పార్లమెంట్ ఉభయ సభల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. అధికార, విపక్ష సభ్యుల పోటాపోటీ ఆందోళనలతో రచ్చరచ్చగా మారింది. రాహుల్‌గాంధీ లండన్ వేదికగా దేశాన్ని బద్నామ్ చేసేలా ప్రవర్తించారంటూ ధ్వజమెత్తారు కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్. రాజ్‌నాథ్‌సింగ్ వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ సభ్యులు స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు. హిండెన్‌బర్గ్ నివేదిక, దర్యాప్తు సంస్థల దుర్వినియోగంపై విపక్షాలు నిరసనలు చేపట్టాయి. సభలో తీవ్ర గందరగోళం నెలకొనడంతో లోక్‌సభ 2 గంటల వరకు వాయిదా పడింది.
ఇక రాజ్యసభలోనూ సేమ్ సీన్ రిపీటైంది. అదానీ అంశంపై జేపీసీ వేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలకు దిగారు విపక్షాలు. హిండెన్‌బర్గ్‌పై గళమెత్తితే మా మైకులు కట్ చేస్తున్నారంటూ ఫైరయ్యారు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జునఖర్గే. దీంతో రాజ్యసభ కూడా మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది.
ఇక అంతకుముందు పార్లమెంట్ ఆవరణలో ఆందోళనకు దిగారు BRS, ఆప్ ఎంపీలు. దర్యాప్తు సంస్థల దుర్వినియోగానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మరోవైపు పార్లమెంటులో వ్యవహరించాల్సిన తీరుపై ప్రతిపక్ష నేతలు సమావేశమయ్యారు. ఈ భేటీకి 15 ప్రతిపక్ష పార్టీలు హాజరయ్యాయి. ఈ సమావేశానికి దూరంగా ఉన్నారు BRS ఎంపీలు.
మరిన్ని జాతీయ వార్తల కోసం