Anti-Paper Leak Bill 2026: యాంటీ పేపర్‌ లీక్‌ బిల్లుకు లోక్‌సభ ఆమోదం.. కీలక నిబంధనలు ఇవే..

యాంటీ పేపర్‌ లీక్‌ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. మూజువాణి ఓటుతో సభ్యులు బిల్లుకు ఆమోదం తెలిపారు. కాగా, విపక్షాల సవరణలు విగిపోయాయి.. బిల్లు ఆమోదం అనంతరం విపక్షాల ఆందోళనల మధ్య లోక్‌సభ రేపటికి వాయిదా పడింది. పరీక్షా పేపర్ లీక్ కు పాల్పడితే.. కఠిన చర్యలు తీసుకునేలా Anti-Paper Leak Bill 2026 రూపొందించారు.

Anti-Paper Leak Bill 2026: యాంటీ పేపర్‌ లీక్‌ బిల్లుకు లోక్‌సభ ఆమోదం.. కీలక నిబంధనలు ఇవే..
Anti Paper Leak Bill Pass

Updated on: Jul 29, 2026 | 7:26 PM

యాంటీ పేపర్‌ లీక్‌ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. మూజువాణి ఓటుతో సభ్యులు బిల్లుకు ఆమోదం తెలిపారు. కాగా, విపక్షాల సవరణలు విగిపోయాయి.. బిల్లు ఆమోదం అనంతరం విపక్షాల ఆందోళనల మధ్య లోక్‌సభ రేపటికి వాయిదా పడింది. పరీక్షా పేపర్ లీక్ కు పాల్పడితే.. కఠిన చర్యలు తీసుకునేలా Anti-Paper Leak Bill 2026 రూపొందించారు.  అంతకుముందు యాంటీ పేపర్‌ లీక్‌ బిల్లుపై లోక్ సభలో సుధీర్ఘ చర్చ జరిగింది. పేపర్ లీక్ విషయంతోపాటు.. విద్యార్థుల ఆందోళనలపై చర్యలు, సవరణలపై విపక్షలు ప్రశ్నలు సంధించాయి.

పబ్లిక్ ఎగ్జామినేషన్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) సవరణ బిల్లు, 2026 – కీలక నిబంధనలు

ఈ చట్టం అక్రమాలకు పాల్పడేవారికి విధించే శిక్షలను గణనీయంగా పెంచుతుంది. ప్రస్తుతం ఉన్న మూడు నుంచి ఐదు సంవత్సరాలతో పోలిస్తే, జైలు శిక్షను కనీసం ఐదు సంవత్సరాలకు పెంచారు.. దీనిని పది సంవత్సరాల వరకు పొడిగించవచ్చు. గరిష్ట జరిమానాను రూ.10 లక్షల నుంచి రూ.50 లక్షలకు పెంచారు.

ఇలాంటి నేరాలకు పాల్పడిన సేవా సంస్థలకు విధించే గరిష్ట జరిమానాను ఇప్పుడు రూ.5 కోట్లకు పెంచగా, ప్రభుత్వ పరీక్షలు నిర్వహించకుండా విధించే నిషేధ కాలాన్ని నాలుగు సంవత్సరాల నుండి ఎనిమిది సంవత్సరాలకు రెట్టింపు చేశారు.

వ్యవస్థీకృత పరీక్షలకు సంబంధించిన నేరాల కేసుల్లో, కనీస జైలు శిక్షను ఐదు సంవత్సరాల నుండి ఏడు సంవత్సరాలకు (పది సంవత్సరాల వరకు) పెంచగా, గరిష్ట జరిమానాను రూ.1 కోటి నుండి రూ.10 కోట్లకు పెంచారు.

పేపర్ లీక్‌లు మరియు ఇతర పరీక్షలకు సంబంధించిన నేరాలపై విచారణ జరిపేందుకు ఒక ప్రత్యేక టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసే అధికారాన్ని కూడా ఈ బిల్లు కేంద్ర ప్రభుత్వానికి కల్పిస్తుంది. కొత్త సెక్షన్ 12A ప్రకారం, రెండు నెలల్లోగా దర్యాప్తును పూర్తి చేయడం, రోజువారీ విచారణల కోసం సెషన్స్ కోర్టులను ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులుగా నియమించడం, ఛార్జిషీట్ దాఖలు చేసిన మూడు నెలల్లోగా విచారణలను పూర్తి చేయడం, ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకానికి వీలు కల్పించడం వంటివి తప్పనిసరి.

రాహుల్ వ్యాఖ్యలు.. లోక్ సభలో రచ్చ..

యాంటీ పేపర్‌ లీక్‌ బిల్లుపై చర్చలో విపక్ష నేత రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలపై లోక్‌సభలో రచ్చ జరిగింది. ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఆదేశాల మేరకే విద్యార్ధులపై కాల్పులు జరిపారని రాహుల్‌ ఆరోపించారు. పెల్లెట్‌ గన్స్‌ ప్రయోగంతో విద్యార్ధులకు తీవ్ర గాయాలయ్యాయని అన్నారు. దీనికి అమిత్‌షానే కారణమన్నారు. పేపర్‌ లీక్‌ బిల్లుపై చర్చలో ప్రధాని మోదీ, అమిత్‌షా ఎందుకు పాల్గొనడం లేదని ప్రశ్నించారు. అయితే రాహుల్‌ వ్యాఖ్యలపై బీజేపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం చెప్పారు. అమిత్‌షా చేసిన ఆరోపణలకు రాహుల్‌ ఆధారాలు చూపించాలని డిమాండ్‌ చేశారు. అమిత్‌షాకు క్షమాపణలు చెప్పిన తరువాతే సభలో రాహుల్‌ మాట్లాడాలని అన్నారు. అయితే అమిత్‌షాపై తన వ్యాఖ్యలను రాహుల్‌ సమర్ధించుకున్నారు. ఢిల్లీ పోలీసులు కేంద్ర హోంశాఖ కిందే పనిచేస్తారని అన్నారు.

కేంద్ర మంత్రి జితేంద్రసింగ్‌ కౌంటర్..

లోక్‌సభలో రాహుల్‌ వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు కేంద్ర మంత్రి జితేంద్రసింగ్‌. ఏ మంత్రి కూడా కాల్పులు జరపాలని ఆదేశాలు ఇవ్వరని అన్నారు. జులై 21న ప్రధాని మోదీ నివాసం దగ్గర రాహుల్‌ ఎందుకు ధర్నా చేశారో తెలియదన్నారు. చాలా బాధ్యతారాహిత్యంగా రాహుల్‌ మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

వందేమాతరం సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం

వందేమాతరం సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. మూజువాణి ఓటుతో బిల్లుకు ఆమోదం లభించింది. అనంతరం రాజ్యసభ కూడా రేపటికి వాయిదా పడింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us