Mahua Moitra: పార్లమెంట్‌ ముందుకు క్యాష్‌ ఫర్‌ క్వశ్చన్స్‌ వ్యవహారం.. ఏధిక్స్ కమిటీ రిపోర్ట్‌పై చర్చ జరగాలంటోన్న విపక్షాలు

|

Dec 08, 2023 | 9:32 AM

తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ మహువా మెయిత్రాపై వేటు తప్పదా?. మహువా అంశం, కమిటీ రిపోర్ట్‌పై చర్చ జరగాలంటూ విపక్షాలు పట్టబడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే లోక్‌సభలో ఇవాళ ఏం జరగనుంది?. ఎథిక్స్‌ కమిటీ రిపోర్ట్‌పై చర్చ జరుగుతుందా? కేంద్రం ఏమంటోంది? అన్నదీ హాట్ ‌టాపిక్‌గా మారింది.

Mahua Moitra: పార్లమెంట్‌ ముందుకు క్యాష్‌ ఫర్‌ క్వశ్చన్స్‌ వ్యవహారం.. ఏధిక్స్ కమిటీ రిపోర్ట్‌పై చర్చ జరగాలంటోన్న విపక్షాలు
Mahua Moitra
Follow us on

తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ మహువా మెయిత్రాపై వేటు తప్పదా?. మహువా అంశం, కమిటీ రిపోర్ట్‌పై చర్చ జరగాలంటూ విపక్షాలు పట్టబడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే లోక్‌సభలో ఇవాళ ఏం జరగనుంది?. ఎథిక్స్‌ కమిటీ రిపోర్ట్‌పై చర్చ జరుగుతుందా? కేంద్రం ఏమంటోంది? అన్నదీ హాట్ ‌టాపిక్‌గా మారింది.

క్యాష్‌ ఫర్‌ క్వశ్చన్స్‌ వ్యవహారంలో టీఎంసీ ఎంపీ మహువా మెయిత్రాపై ఇవాళ నిర్ణయం తీసుకోనుంది కేంద్రం. ఎథిక్స్‌ కమిటీ రిపోర్ట్‌ను ఈరోజు లోక్‌సభలో ప్రవేశపెట్టబోతోంది. కేంద్రం అడుగులు చూస్తుంటే మహువా మెయిత్రాపై వేటు పడటం ఖాయంగా కనిపిస్తోంది. అయితే, మహువా అంశం, కమిటీ రిపోర్ట్‌పై చర్చ జరపకుండా చర్యలు తీసుకుంటే ఊరుకునేది లేదంటున్నాయి విపక్షాలు. ఇది ఫిక్సింగ్‌, మహువాకు వ్యతిరేకంగా చిన్న ఆధారం కూడా లేదంటున్నారు విపక్ష సభ్యులు.

లోక్‌సభలో ప్రశ్నలు అడగటానికి డబ్బు తీసుకున్నారనేది మహువా మెయిత్రాపై ప్రధాన అభియోగం. వ్యాపారవేత్త దర్శన్‌ హీరానందాని ఆదేశాల మేరకు… అదానీ గ్రూప్‌పై ప్రశ్నలు వేశారంటూ లోక్‌సభ స్పీకర్‌కు బీజేపీ ఎంపీ నిషికాంత్‌ దూబే ఫిర్యాదు చేయడంతో ఇది తెరపైకి వచ్చింది. ఈ అంశాన్ని ఎథిక్స్‌ కమిటీకి స్పీకర్‌ సిఫార్సు చేయడంతో… పార్లమెంట్‌ నుంచి బహిష్కరించాలని రిపోర్ట్‌ ఇచ్చింది. ఇప్పుడు ఈ నివేదికను లోక్‌సభలో ప్రవేశపెట్టనుంది కేంద్రం. ఒకవేళ సభ ఆమోదిస్తే ఎంపీ సభ్యత్వాన్ని కోల్పోనున్నారు మహువా.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…