షాకింగ్‌.. పార్లమెంట్‌ భవనాన్ని కూల్చే దిశగా కేంద్రం అడుగులు

కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకునేందుకు రెడీ అయ్యింది. ప్రస్తుతం ఉన్న పార్లమెంట్ భవనం పురాతనమైందని.. దీన్ని కూల్చేసి ఇదే స్థానంలో కొత్త భవనాన్ని కట్టేందుకు ప్రయత్నాలు..

షాకింగ్‌.. పార్లమెంట్‌ భవనాన్ని కూల్చే దిశగా కేంద్రం అడుగులు

Edited By:

Updated on: Jul 29, 2020 | 1:13 PM

కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకునేందుకు రెడీ అయ్యింది. ప్రస్తుతం ఉన్న పార్లమెంట్ భవనం పురాతనమైందని.. దీన్ని కూల్చేసి ఇదే స్థానంలో కొత్త భవనాన్ని కట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభిస్తోంది. ఈ మేరకు మంగళ వారం నాడు సుప్రీంకోర్టులో ఓ అఫిడవిట్‌ను దాఖలు చేసింది. ఇప్పుడు ఉన్న పార్లమెంట్ భవనం వంద ఏళ్ల క్రితం నిర్మించిందని.. భద్రతా పరంగా అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయని కేంద్రం పేర్కొంది. అంతేకాదు.. భవనంలో అకస్మాత్తుగా అగ్ని ప్రమాదం చోటుచేసుకుంటే కష్టమేనంటూ అఫిడవిట్‌లో చెప్పుకొచ్చింది. అందుకే.. ఇప్పుడు ఉన్న ఈ భవనాన్ని కూల్చేసి.. కొత్త భవం నిర్మిస్తామని కేంద్రం తెలిపింది.

కాగా, 1921లో ఈ పార్లమెంట్‌ భవన నిర్మాణాన్ని ప్రారంభించి.. 1937లో పూర్తి చేశారు. దాపు వందేళ్లు గడుస్తుండటంతో.. దీనిని కూల్చేసి.. కొత్త భవనాన్ని నిర్మించేందుకు ప్లాన్లు వేస్తోంది కేంద్ర ప్రభుత్వం.