
పరీక్షా పే చర్చా మళ్లీ వచ్చేసింది.. కానీ ఈసారి డిఫరెంట్ లెవెల్. 2026 ఎడిషన్ నిజంగా పాన్-ఇండియా వైబ్ తీసుకొచ్చింది. ఇప్పటివరకు ఢిల్లీ వరకే పరిమితమైన ఈ కార్యక్రమం, ఈసారి దేశమంతా చుట్టేసింది. ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీ మాత్రమే కాదు. .కోయంబత్తూరు, రాయ్‌పూర్, దేవ్ మోగ్రా, గువాహటిలోని స్టూడెంట్స్‌తో నేరుగా మాట్లాడారు. అంటే నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్.. మొత్తం దేశంలోని అన్ని ప్రాంతాల విద్యార్థులతో కనెక్ట్ అయ్యారు. ఈసారి నంబర్లు కూడా నెక్ట్స్ లెవెల్. ఏకంగా4.5 కోట్ల మందికి పైగా రిజిస్ట్రేషన్లు నమోదు అయ్యాయి. పరీక్షా పే చర్చాకు సంబంధించిన యాక్టివిటీస్‌లో 2.26 కోట్ల మంది యాక్టివ్ పార్టిసిపేషన్ చేశారు. టోటల్‌గా చూస్తే 6.76 కోట్లకు పైగా జనాలు PPC 2026లో భాగం అయ్యారు. కానీ PPC అంటే కేవలం పరీక్షల గురించే కాదు. ఇది స్ట్రెస్ తగ్గించుకోవడం, మైండ్ హెల్త్‌ని సీరియస్‌గా తీసుకోవడం, మార్క్స్ కంటే మైండ్‌సెట్ ఇంపార్టెంట్ అని చెప్పే ఓ ఓపెన్ చాట్.
“ఫెయిల్యూర్ ఓకే”, “కంపేర్ చేయొద్దు”, “నిన్ను నువ్వే నమ్ము”.. ఇలాంటి రియల్ టాక్ మెసేజ్‌లు స్టూడెంట్స్‌కు స్ట్రాంగ్‌గా కనెక్ట్ అయ్యాయి. పరీక్షా పే చర్చా నిరంతరం విస్తరిస్తున్న క్రమంలో.. 2026 సంచిక ఒక జాతీయ ఉద్యమంగా మారిన సంభాషణకు ప్రతీకగా నిలిచింది. భారత యువత భవిష్యత్తును తీర్చిదిద్దడంలో సంభాషణ, ప్రోత్సాహం, అవగాహన ఎంత కీలకమో మరోసారి నిరూపించింది.
వీడియో దిగువన చూడండి…