Paramilitary Jawan Suicide: మెట్రో స్టేషన్‌లో వరుస సూసైడ్స్.. తలపై కాల్చుకుని మరో జవాన్‌ ఆత్మహత్య! అసలు CISF సిబ్బందికి ఏమైంది?

ఢిల్లీ మెట్రో స్టేషన్‌లో దారుణం చోటుచేసుకుంది. రైల్వే స్టేషన్‌లో విధి నిర్వహణలో ఉన్న సెంట్రల ఇండస్ట్రియల్‌ సెక్యురిటీ ఫోర్ప్‌ (సీఐఎస్‌ఎఫ్‌)కు చెందిన ఓ ఆర్మీ జవాన్ తన వద్ద ఉన్న సర్వీస్‌ తుపాకీతో తనకు తాను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఢిల్లీ విహార్ వెస్ట్ మెట్రో స్టేషన్లో ఆదివారం (ఏప్రిల్ 7) ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది..

Paramilitary Jawan Suicide: మెట్రో స్టేషన్‌లో వరుస సూసైడ్స్.. తలపై కాల్చుకుని మరో జవాన్‌ ఆత్మహత్య! అసలు CISF సిబ్బందికి ఏమైంది?
Paramilitary Jawan Suicide

Updated on: Apr 07, 2024 | 4:23 PM

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 7: ఢిల్లీ మెట్రో స్టేషన్‌లో దారుణం చోటుచేసుకుంది. రైల్వే స్టేషన్‌లో విధి నిర్వహణలో ఉన్న సెంట్రల ఇండస్ట్రియల్‌ సెక్యురిటీ ఫోర్ప్‌ (సీఐఎస్‌ఎఫ్‌)కు చెందిన ఓ ఆర్మీ జవాన్ తన వద్ద ఉన్న సర్వీస్‌ తుపాకీతో తనకు తాను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఢిల్లీ విహార్ వెస్ట్ మెట్రో స్టేషన్లో ఆదివారం (ఏప్రిల్ 7) ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు స్టేషన్‌లో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

స్టేషన్‌లో కుర్చీలో కూర్చుని ఉన్న జవాన్‌ తన వద్ద ఉన్న తుపాకీని తలకు గురిపెట్టుకుని కాల్చుకోవడం సీసీ కెమెరా వీడియోలో చూడొచ్చు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మృతుడు మహారాష్ట్రలోని గడ్చిరోలికి చెందిన సహరే కిషోర్‌గా పోలీసులు గుర్తించారు. ఢిల్లీ విహార్ వెస్ట్ మెట్రో స్టేషన్‌లో సహరే కిషోర్‌ 2022 నుంచి విధులు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. మృతి చెందిన జవాన్‌ డిప్రెషన్‌లో ఉన్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. అయితే ఆయన ఆత్మహత్యకు గల ఖచ్చితమైన కారణాలు తెలియాల్సి ఉంది. ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణ కొనసాగుతున్నట్లు ఓ పోలీస్‌ అధికారి మీడియాకు తెలిపారు.

కాగా గురువారం (ఏప్రిల్ 4) ఢిల్లీలోని నాంగ్లోయ్ మెట్రో స్టేసన్‌లో మరో సీఐఎస్‌ఎఫ్‌ జవాన్‌ ఇదే మాదిరి తనను తాను తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. నంగ్లోయ్ మెట్రో స్టేషన్‌లో విధులు నిర్వహిస్తోన్న సిఐఎస్‌ఎఫ్ జవాన్ షహ్రే కిషోర్ తనను తాను తుపాకీతో కాల్చుకుని మెట్రో స్టేషన్‌లోని బ్యాగేజీ స్కానింగ్ మెషిన్ సమీపంలో శవమై కనిపించాడు. రోజుల వ్యవధిలోనే ఇద్దరు జవాన్ల సూసైడ్‌ ఘటన రాజధాని నగరంలో కలకలం రేపుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.