Pan Card And Aadhaar Link: మీకు పాన్ కార్డు ఉందా.? ఆధార్ నెంబర్‌తో దానిని లింక్ చేశారా.? లింక్ చేయకపోతే ఖంగారుపడకండి.! ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ గుడ్ న్యూస్ అందించింది. గతంలో ఆధార్ కార్డుతో పాన్ కార్డు అనుసంధానం చేసే గడువును 2021 జూన్ 30వ తేదీ వరకు వరకు గడువు విధించగా.. అది మరికొన్నిరోజుల్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో, పాన్ కార్డు-ఆధార్ అనుసంధానం గడువును సెప్టెంబరు 30 వరకు పొడిగిస్తున్నట్టు తాజాగా ప్రకటన చేసింది.
కోవిడ్ వ్యాప్తి కారణంగా తలెత్తే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని ఆదాయపు పన్ను శాఖ ట్విట్టర్ ద్వారా తెలిపింది. వాస్తవానికి ఆధార్‌తో పాన్ కార్డు అనుసంధానం చేసే గడువు 2021 జూన్ 30వ తేదీతో ముగియనుంది. అయితే ప్రస్తుత కరోనా పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని చివరి తేదీని ఆదాయపు పన్ను శాఖ పొడిగించింది. కాగా, మీ ఆధార్‌తో పాన్ నెంబర్ అనుసంధానం చేయకపోతే SMS ద్వారా కూడా చేసుకోవచ్చు. లేదా మీ ఖాతా ఉన్న బ్రాంచ్‌కు వెళ్లి కూడా చేయవచ్చు.
సెక్షన్ 139 ఏఏ ప్రకారం ప్రతి పౌరుడు తమ ఆదాయ వివరాల సమర్పణ పత్రంలోనూ, పాన్ కార్డు దరఖాస్తులోనూ ఆధార్ నెంబరు పొందపరచడం తప్పనిసరి. ఆధార్ లింక్ చేయని పాన్ కార్డులు సెప్టెంబరు 30 తర్వాత చెల్లుబాటు కావని కేంద్రం వివరించింది.
ఎస్‌ఎంఎస్ ద్వారా కూడా పాన్ ఆధార్ లింక్ చేసుకోవచ్చు. ఇందు కోసం మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ నుంచి UIDAIPAN అని టైప్ చేసి మీ 12 అంకెల ఆధార్ సంఖ్యను ఎంటర్ చేయండి. ఆ తర్వాత స్పేస్ ఇచ్చి మీ 10 అంకెల పాన్ కార్డు నెంబర్‌ను ఎంటర్ చేయండి. దీన్ని 567678 లేదా 56161 నంబర్‌కు SMS పంపించండి. అంతే మీ పని పూర్తయినట్లే. వెంటనే మీ ఆధార్‌తో పాన్ కార్డు అనుసంధానం అయినట్లు మీ మొబైల్ నెంబర్‌కు సందేశం వస్తుంది.