NRC Act: మళ్లీ తెరపైకి ఎన్నార్సీ.. లోక్‌సభలో కేంద్ర మంత్రి కీలక ప్రకటన.. ఇంతకీ నిత్యానంద రాయ్‌ ఏమన్నారంటే?

|

Mar 15, 2022 | 8:51 PM

ఎన్నార్సీపై కీలక ప్రకటన చేశారు కేంద్రమంత్రి నిత్యానంద రాయ్. జాతీయ స్థాయిలో భారత పౌరుల జాతీయ రిజిస్టర్ ( NRIC ) తయారీకి సంబంధించి భారత ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని మంత్రి స్పష్టం చేశారు.

NRC Act: మళ్లీ తెరపైకి ఎన్నార్సీ.. లోక్‌సభలో కేంద్ర మంత్రి కీలక ప్రకటన.. ఇంతకీ నిత్యానంద రాయ్‌ ఏమన్నారంటే?
Nityanand Rai
Follow us on

NRIC Act: ఎన్నార్సీపై కీలక ప్రకటన చేశారు కేంద్రమంత్రి నిత్యానంద రాయ్(Nityanand Rai). జాతీయ స్థాయిలో భారత పౌరుల జాతీయ రిజిస్టర్ (NRIC) తయారీకి సంబంధించి భారత ప్రభుత్వం(Indian Government) ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని మంత్రి స్పష్టం చేశారు. ఈ మేరకు మంగళవారం లోక్‌సభలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్‌రాయ్‌ తెలిపారు. దేశవ్యాప్తంగా అమలవుతున్న నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ స్టేటస్ గురించి తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మాలా రాయ్ అడిగిన ప్రశ్నకు నిత్యానంద రాయ్ లోక్‌సభలో సమాధానం ఇస్తూ.. ఈ విషయం చెప్పారు.

జాతీయ స్థాయిలో ఎన్‌ఆర్‌సీని అమలు చేయడంపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదన్నారు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్. నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ స్థితి గురించి లోక్‌సభలో ప్రశ్నించారు ఎంపీ మాలారాయ్. అస్సాంలో ఎన్‌ఆర్‌సి హోదాతో పాటు, ఎన్‌ఆర్‌సికి సంబంధించిన పనులు ఎప్పుడు పూర్తవుతాయని అడిగారు రాయ్. దీనికి సమాధానమిచ్చారు నిత్యానంద రాయ్. ఇప్పటి వరకు జాతీయ స్థాయిలో భారతీయ పౌరుల జాతీయ రిజిస్టర్‎ను సిద్ధం చేయడానికి, ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. ఈ దేశ పౌరులెవరో, కానివారెవరో ఆరా తీసి, ఇరుగు పొరుగు దేశాల నుంచి అక్రమంగా వచ్చి ఇక్కడుంటున్నవారిని ఏరి పారేయడానికి ఇదొక ప్రక్రియ. చట్ట ప్రకారం భారతీయ పౌరులుగా నమోదైన వారి జాబితాయే NRC.

1955 పౌరసత్వ చట్టం ప్రకారం, భారతీయ పౌరులుగా అర్హత పొందిన వారి పేర్లతోపాటు వారికి సంబంధించిన ఇతర వివరాలు కూడా దీంట్లో పొందుపరుస్తారు. ఈ పట్టికను మొట్టమొదటిసారిగా 1951లో భారతీయుల పౌరసత్వాన్ని, వారి ప్రాపర్టీస్‌ను, ఎకనామిక్ కండిషన్‌ను అంచనా వేయడానికి ప్రభుత్వం రూపొందించింది. ఇప్పటివరకు దానిని మళ్లీ అప్‌గ్రేడ్ చేయలేదు. అయితే, ఇది అస్సాంలో మాత్రమే ఎప్పటికప్పుడు వివిధ కారణాలతో అప్‌గ్రేడ్ అవుతోంది. ఏ మతానికి చెందిన వారైనా భారతీయ పౌరులందరికీ ఈ జాబితాలో స్థానం లభిస్తుంది. అస్సాంలో 2013లో సుప్రీంకోర్టు ఆదేశం ప్రకారం NRC ప్రక్రియ ప్రారంభమైంది. దీనిపై అస్సామీయుల ఆందోళలనలకు దిగారు. అప్పట్లో ఇది రాజకీయ దుమారానికి కారణమైంది. తాజాగా మళ్లీ కేంద్రమంత్రి ప్రకటనతో ఈ అంశం తెరపైకి వచ్చింది.

అయితే, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి రాయ్ లిఖితపూర్వక సమాధానంలో, జాతీయ స్థాయిలో భారతీయ పౌరుల జాతీయ రిజిస్టర్ (ఎన్‌ఆర్‌ఐసి)ని సిద్ధం చేయడానికి ప్రభుత్వం ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదన్నారు.సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎన్‌ఆర్‌సిలో చేర్చిన అనుబంధ జాబితా, ఆన్‌లైన్ కుటుంబాల వారీగా మినహాయింపు జాబితా హార్డ్ కాపీని 31 ఆగస్టు 2019న ప్రచురించినట్లు ఆయన చెప్పారు. అంతకుముందు, నవంబర్ 30 న, లోక్‌సభలో హోం మంత్రిత్వ శాఖ, మొత్తం 1,33,83,718 మంది భారతీయులు విదేశాలలో నివసిస్తున్నారు. గత ఐదేళ్లలో మొత్తం 4,177 మందికి భారత పౌరసత్వం మంజూరు చేయడం జరిగిందని పేర్కొంది.

NRC అంటే ఏమిటి?
వాస్తవానికి, భారతదేశంలో అక్రమంగా స్థిరపడిన చొరబాటుదారులను దేశం నుండి తరిమి కొట్టడమే NRC లేదా నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ బిల్లు యొక్క ఉద్దేశ్యం. ఈ బిల్లు ఒక రిజిస్టర్, దీని కింద దేశంలో నివసిస్తున్న చట్టబద్ధమైన పౌరులందరి రికార్డులు ఉంచడం జరుగుతుంది. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో అస్సాంలో 2013లో NRC ప్రారంభమైంది. ఈ బిల్లు ప్రస్తుతం అస్సాం మినహా మరే ఇతర రాష్ట్రంలోనూ వర్తించదు. అయితే, దేశవ్యాప్తంగా ఎన్‌ఆర్‌సిని అమలు చేస్తామని ఆ దేశ హోంమంత్రి అమిత్ షా ఇప్పటికే స్పష్టం చేశారు.

2019 సార్వత్రిక ఎన్నికల కోసం బీజేపీ తన ఎన్నికల మేనిఫెస్టోలో దేశవ్యాప్తంగా ఎన్‌ఆర్‌సిని అమలు చేస్తామని హామీ ఇచ్చింది. 19 నవంబర్ 2019 న, దేశవ్యాప్తంగా NRC అమలు చేయడం జరుతుందని గతంలో హోం మంత్రి అమిత్ షా రాజ్యసభలో ప్రకటించారు. పౌరసత్వ నియమాలు 2003 ప్రకారం, కేంద్ర ప్రభుత్వం జాతీయ జనాభా రిజిస్టర్ (NPR)ని సిద్ధం చేయడానికి, అందులో సేకరించిన డేటా ఆధారంగా NRCని సిద్ధం చేయడానికి ఒక ఉత్తర్వును జారీ చేయవచ్చు. దీని తర్వాత, ఆ వ్యక్తి పేరు NRCలో చేర్చాలా లేదా అనేది స్థానిక అధికారులు నిర్ణయిస్తారు. ఇది వారి పౌరసత్వ స్థితిని నిర్ణయిస్తుంది. మరోవైపు, భారతదేశం అంతటా దీన్ని అమలు చేయడానికి కొత్త నియమాలు లేదా చట్టాలు అవసరం లేదని అధికార వర్గాలు చెబుతున్నాయి.

Read Also….  Startup Companies: భారీగా పతనమవుతున్న స్టార్టప్‌ కంపెనీల షేర్లు.. కీలక నిర్ణయం దిశగా సెబీ అడుగులు..