జమ్మూకశ్మీర్‌లో భారత్ – పాకిస్తాన్ సరిహద్దుల వెంబడి పాకిస్తాన్ ఆర్మీ రెచ్చిపోయింది. మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ భారత ఆర్మీపై కాల్పులకు తెగబడింది. ఈ ఘటనలో ఇద్దరు భారత జవాన్లు వీర మరణం పొందారు. అసలేం జరిగిందంటే.. జమ్మూ కశ్మీర్‌లోని రాజౌరీ జిల్లా సుందర్‌బని సెక్టార్‌లో లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద పాక్ భద్రతా బలగాలు పెద్ద ఎత్తున కాల్పులకు తెగబడ్డాయి. మోర్టార్ షెల్స్‌తో విరుచుకుపడ్డారు. పాక్ ఆర్మీ కాల్పులతో అప్రమత్తమైన భారత భద్రతా బలగాలు వారికి ధీటైన సమాధానం చెప్పారు. అంతేస్థాయిలో పాక్ ఆర్మీపై ఎదురు కాల్పులు జరిపారు. అయితే దురుదృష్టావశాత్తు ఇద్దరు భారత జవాన్లు వీర మరణం పొందారు. ఈ కాల్పుల్లో చనిపోయిన వారిలో నాయక్ ప్రేమ్ బహదూర్ ఖత్రి, రైఫిల్ మెన్ సుఖ్‌బిర్ సింగ్ ఉన్నట్లు రక్షణ శాఖ ఉన్నతాధికారులు ప్రకటించారు. దేశం వీరి త్యాగాలను మరువబోదని, వారి త్యాగాలు వృధా కాబోవని పేర్కొన్నారు.
Also Read :