నౌషేరా సెక్టార్‌ మీదుగా కాల్పులకు దిగిన పాక్‌

| Edited By:

Aug 12, 2020 | 9:36 PM

పాకిస్థాన్‌ మరోసారి రెచ్చిపోయింది. బుధవారం నాడు రాత్రి.. జమ్ముకశ్మీర్‌లోని రాజౌరీ జిల్లా నౌషేరా సెక్టార్ మీదుగా కాల్పులకు దిగింది. గత కొద్ది రోజులుగా కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు..

నౌషేరా సెక్టార్‌ మీదుగా కాల్పులకు దిగిన పాక్‌
Follow us on

పాకిస్థాన్‌ మరోసారి రెచ్చిపోయింది. బుధవారం నాడు రాత్రి.. జమ్ముకశ్మీర్‌లోని రాజౌరీ జిల్లా నౌషేరా సెక్టార్ మీదుగా కాల్పులకు దిగింది. గత కొద్ది రోజులుగా కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ పాక్‌ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. బుధవారం నాడు రాత్రి 7.50 గంటలకు సరిహద్దులోని నౌషేరా సెక్టార్‌ మీదుగా కాల్పులకు దిగింది. చిన్న చిన్న ఆయుధాలతో పాటుగా.. మోర్టార్‌ షెల్స్‌ను ఉపయోగిస్తూ దాడులకు దిగింది. పాక్‌ కాల్పులతో అప్రమత్తమైన భారత సైన్యం.. పాక్‌కు ధీటుగా ఎదురుకాల్పులు చేపట్టింది. అయితే గత కొద్ది రోజులుగా పాక్‌ చేస్తున్న ఈ కవ్వింపు చర్యలతో సరిహద్దుల్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలువురు గాయపడుతున్న సంగతి తెలిసిందే.

 

Jammu & Kashmir: Pakistan violates ceasefire in Nowshera sector. Indian Army retaliating.

— ANI (@ANI) August 12, 2020

Read More :

ఆస్పత్రి మెడికల్‌ షాపులో అగ్నిప్రమాదం.. కరోనా రోగుల తరలింపు

శివసేన గూటికి స్వతంత్ర ఎమ్మెల్యే