Pak Weapons: భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్తాన్ కుట్ర.. సంచలన విషయాలు వెల్లడించిన అమెరికా..!

|

May 20, 2022 | 2:06 PM

Pak Nuke Weapons: భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్తాన్‌ చేస్తోన్న కుట్రలను మరోసారి బయటపెట్టింది అమెరికా. ఇండియా టార్గెట్‌గా దాయాది దేశం చేస్తోన్న సీక్రెట్‌ ఆపరేషన్‌ గుట్టు రట్టు చేసింది.

Pak Weapons: భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్తాన్ కుట్ర.. సంచలన విషయాలు వెల్లడించిన అమెరికా..!
India Vs Pakistan
Follow us on

Pak Nuke Weapons: భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్తాన్‌ చేస్తోన్న కుట్రలను మరోసారి బయటపెట్టింది అమెరికా. ఇండియా టార్గెట్‌గా దాయాది దేశం చేస్తోన్న సీక్రెట్‌ ఆపరేషన్‌ గుట్టు రట్టు చేసింది. ఇండియన్‌ ఆర్మీ దూకుడు, సర్జికల్‌ స్ట్రైక్స్‌తో తోక ముడిచిన దాయాది దేశం పాకిస్తాన్‌, తన కుట్రలను సీక్రెట్‌గా చేసుకుంటూ పోతోంది. భారత్‌కు వ్యతిరేకంగా తన వ్యూహాలను గుట్టుచప్పుడు కాకుండా అమలు చేస్తోంది. భారత సైనిక సామర్ధ్యాన్ని తట్టుకుని, దీటుగా ఎదుర్కోవడానికి సీక్రెట్‌ ఆపరేషన్‌ నిర్వహిస్తోంది. కేవలం, అణుసామర్ధ్య విస్తరణ, ఆధునీకరణతోనే భారత్‌ను ఎదుర్కోగలమని భావిస్తోన్న పాకిస్తాన్‌, ఆ దిశగా అడుగులు వేస్తోంది. అందుకు సంబంధించిన వివరాలను అమెరికా బయటపెట్టింది. పాకిస్తాన్‌ పెద్దఎత్తున అణ్వాయుధాలను సమీకరించుకోవడం, ఆధునీకరించుకోవడం, విస్తరించుకోవడంపై మెయిన్‌ ఫోకస్‌ పెట్టిందని అమెరికా తెలిపింది.

సైనికపరంగానే కాకుండా, అణ్వాయుధాల్లోనూ భారత్‌ పటిష్టంగా ఉండటంతోనే పాక్‌, సీక్రెట్‌ న్యూక్లియర్‌ మిషన్‌ కంటిన్యూ చేస్తోందని అంటోంది. న్యూక్లియర్‌ వెపన్స్‌ను పెంచుకోవడంతోపాటు ఆధునిక ఆయుధాలను సమకూర్చుకోవడం ప్రారంభించిందని అమెరికా ఇంటెలిజెన్స్‌ రిపోర్ట్‌ వెల్లడించింది. భారత అణు సంపత్తిని, ఆధిక్యతను తట్టుకుని, నిలబడాలంటే అణు విస్తరణ తప్పదనే నిర్ణయానికి పాక్‌ రక్షణశాఖ వచ్చిందని అంటోంది అమెరికా. కశ్మీర్‌ విషయంలో భారత్‌ ఏకపక్షంగా ముందుకెళ్లడం, ఆర్టికల్‌ 370ని ఎత్తివేయడంతో గుర్రుగా ఉన్న పాకిస్తాన్‌, అణ్వాయుధాల పెంపుపై దృష్టిపెట్టిందని అంటున్నారు. భారత్‌ను ఎదుర్కోవాలంటే అణు సంపత్తిని పెంచుకోవడం ఒక్కటే మార్గమని పాకిస్తాన్‌ భావిస్తోందని తన నివేదికలో వెల్లడించింది అమెరికన్ ఇంటెలిజెన్స్‌.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..