jammu kashmir: తీరు మార్చుకోని పాకిస్తాన్.. LOC వెంబడి మరోసారి కాల్పులు.. తిప్పికొట్టిన భారత సైన్యం!

పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్‌-పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొల్పేలా పాకిస్థాన్ ఆర్మీ ప్రవర్తిస్తోంది. విమరణ ఒప్పందం ఉల్లంఘనపై భారత్‌ ఎన్నిసార్లు హెచ్చరించినా పాక్‌ తన తీరును మాత్రం మార్చుకోవట్లేదు. సరిహద్దుల్లోని నియంత్రణ రేఖ (LOC) వెంబడి మళ్లీ మళ్లీ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. తాజాగా బుధవారం రాత్రి కూడా పాక్‌ సైన్యం కాల్పులు జరిపిందని, వీటిని భారత సైన్యం దీటుగా తిప్పికొట్టిందని రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి.

jammu kashmir: తీరు మార్చుకోని పాకిస్తాన్.. LOC వెంబడి మరోసారి కాల్పులు.. తిప్పికొట్టిన భారత సైన్యం!
Jammu Kashmir Loc Firing

Updated on: May 02, 2025 | 11:29 AM

పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్‌-పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొల్పేలా పాకిస్థాన్ ఆర్మీ ప్రవర్తిస్తోంది. విమరణ ఒప్పందం ఉల్లంఘనపై  భారత్‌ ఎన్నిసార్లు హెచ్చరించినా పాక్‌ తన తీరును మాత్రం మార్చుకోవట్లేదు. 2003 విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి సరిహద్దుల్లోని నియంత్రణ రేఖ (LOC) వెంబడి మళ్లీ మళ్లీ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. ఇక భారత్‌ భద్రతా బలగాలు సైతం వారి కాల్పులను సమర్థవంతంగా తిప్పికొడుతున్నారు.

జమ్మూకాశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్‌పై పాక్‌ అప్రకటిత కాల్పులు జరుపడం స్టార్ట్ చేసింది. అయితే కుక్క తోక వంకరే అన్నట్టు ఇప్పుడు పాకిస్తాన్ వ్యవహరిస్తుంది. భారత్‌-పాక్ మధ్య విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి కాల్పులు జరుపుతున్న తీరుపై  భారత్‌ ఎన్ని సార్లు హెచ్చరించినా.. పాకిస్తాన్ మాత్రం తన తీరును మార్చుకోవట్లేదు. సరిహద్దులోని నియంత్రం రేఖ వెంబడి పదే పదే కవ్వింపు చర్యలకు తెగబడుతోంది. భారత భద్రతా బలగాల స్థావరాలే లక్ష్యంగా కాల్పులు జరుపుతోంది. ఇక వరుసగా ఏడో రోజూ రాత్రి కూడా పాక్‌ రేంజర్లు మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. భారత్-పాక్ సరిహద్దు ప్రాంతాలైన కుప్వారా, బారాముల్లా, పూంఛ్, నౌషేరా, అఖ్నూర్ సెక్టార్లలోని భారత్‌ ఆర్మీ స్థావరాలపై పాకిస్తాన్ సైనికులు కాల్పులు జరిపారు. అయితే అప్రమత్తమైన భారత్‌ ఆర్మీ పాకిస్తాన్ సైనికుల కాల్పులను సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఈ విషయాన్ని భారత్‌ భద్రతా బలగాలు వెల్లడించాయి.

ఇక జమ్మూకాశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడిలో 28 మంది అమాయక పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన యావత్‌ భారత దేశాన్ని కలిచి వేసింది. ఈ ఉగ్రదాడి నేపథ్యంలో పాక్‌కు వ్యతిరేకంగా భారత్‌ కఠిన నిర్ణయాలు తీసుకుంది. భారత్‌-పాక్ మధ్య దౌత్య ఒప్పందాలను రద్దు చేసుకుంది. భారత్‌ నుంచి పాక్‌ వెళ్లే సింధూ జలాలను నిలిపివేసింది. దీంతో అప్పటి నుంచి పాకిస్థాన్‌ భారత్‌ సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి భారత సైనిక స్థావరాల లక్ష్యంగా పదేపదే కాల్పులు జరుపుతుంది. ఇటు భారత్ ఆర్మీ సైతం పాకిస్థాన్ కవ్వింపు చర్యలను సమర్థవంతంగా తిప్పికొడుతోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…