సరిహద్దులో పాక్‌ సైన్యం కవ్వింపులు.. లోయలో ఉగ్రవాదులు..

| Edited By:

Jul 05, 2020 | 12:10 AM

పాకిస్థాన్‌ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. శనివారం నాడు రాత్రి 7.45 గంటల ప్రాంతంలో పూంచ్ జిల్లాలోని దిగ్వార్‌ సెక్టార్‌ మీదుగా కాల్పులకు దిగింది. ఈ విషయాన్ని జమ్ముకశ్మీర్ పోలీస్..

సరిహద్దులో పాక్‌ సైన్యం కవ్వింపులు.. లోయలో ఉగ్రవాదులు..
Follow us on

పాకిస్థాన్‌ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. శనివారం నాడు రాత్రి 7.45 గంటల ప్రాంతంలో పూంచ్ జిల్లాలోని దిగ్వార్‌ సెక్టార్‌ మీదుగా కాల్పులకు దిగింది. ఈ విషయాన్ని జమ్ముకశ్మీర్ పోలీస్ అధికారులు తెలిపారు. పాక్ సైన్యం జరిపిన దాడితో అప్రమత్తమైన ఆర్మీ.. వెంటనే గట్టిగా బదులిచ్చింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి
ఉంది.

మరోవైపు కుల్గాం జిల్లాలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. కూంబింగ్ చేపడుతున్న భద్రతా బలగాలపై కాల్పులకు దిగారు. దీంతో అప్రమత్తమైన సైన్యం ఎదురుకాల్పులు చేపట్టింది. జల్లాలోని అర్రాహ్‌ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సైన్యం జరిపిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. వీరు హిజ్బుల్ ముజాహిద్దీన్‌ ఉగ్ర సంస్థకు చెందిన వారిగా గుర్తించారు. వీరిలో ఒకరు విదేశీయుడు కాగా.. మరో ఉగ్రవాదిని గుర్తించలేదని అధికారులు తెలిపారు.