Oxygen: థాయిలాండ్‌ నుంచి భారత్‌కు 11 క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లు.. ఉచితంగా అందించనున్న మేఘా ఇంజనీరింగ్ సంస్థ

|

May 22, 2021 | 6:26 PM

Oxygen Tankers: దేశంలో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తుండటంతో కరోనా బారిన పడే వారి సంఖ్య పెరిగిపోతోంది. ఒక వైపు పాజిటివ్‌ కేసులు పెరుగుతుంటే.. మరో వైపు..

Oxygen: థాయిలాండ్‌ నుంచి భారత్‌కు 11 క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లు.. ఉచితంగా అందించనున్న మేఘా ఇంజనీరింగ్ సంస్థ
Oxygen Tankers
Follow us on

Oxygen Tankers: దేశంలో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తుండటంతో కరోనా బారిన పడే వారి సంఖ్య పెరిగిపోతోంది. ఒక వైపు పాజిటివ్‌ కేసులు పెరుగుతుంటే.. మరో వైపు ఆక్సిజన్‌ కొరత మరింత ఆందోళనకు గురి చేస్తోంది. కరోనా ఫస్ట్‌ వేవ్‌ కంటే సెకండ్‌ వేవ్‌ వైరస్‌ తీవ్రతరం కావడంతో ఆక్సిజన్‌ అందక ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఈ సెకండ్‌ వేవ్‌లో ఆక్సిజన్‌ కొరత ఏర్పడుతోంది. ఆక్సిజన్‌ కొరత తీర్చేందుకు ప్రభుత్వం, ఎన్జీవోలు ఎంతో కృషి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో దీనిని అధిగమించేందుకు మేఘా ఇంజనీరింగ్ ఇన్ ఫ్రా స్ట్రక్చర్స్ లిమిటెడ్ (MEIL) సంస్థ థాయ్ లాండ్ నుంచి 11 క్రయోజెనిక్ ఆక్సీజన్ ట్యాంకర్లను దిగుమతి చేస్తోంది.

ఈ ట్యాంకులను యుద్ధ ప్రాతిపదికన దిగుమతి చేసుకోవడానికి అధికారులు చర్యలు తీసుకున్నారు. ప్రతి క్రయోజెనిక్ ట్యాంకర్‌లో 1.40  కోట్ల లీటర్ల ఆక్సిజన్ ఉంటుంది. పెద్ద సంఖ్యలో ట్యాంకర్లను దిగుమతి చేసుకోవడం దేశంలో ఇదే మొదటిసారి. మేఘా ఇంజనీరింగ్ కార్పొరేషన్ (మెయిల్) తన సామాజిక సేవా బాధ్యతలో భాగంగా థాయిలాండ్ నుండి భారతదేశానికి ఆక్సిజన్ ట్యాంకర్లను దిగుమతి చేసుకుంటోంది.

అయితే మొదటి విడతలో ఆర్మీ విమానంలో మూడు ట్యాంకులు భారత్‌కు చేరుకోనున్నాయి. శనివారం మధ్యాహ్నం హైదరాబాద్ బేగంపేట్ ఎయిర్ పోర్ట్ లో ప్రత్యేక డిఫెన్స్ ఎయిర్ క్రాఫ్ట్ లో ఆక్సిజన్ ట్యాంకర్లు చేరుకోనున్నట్లు అధికారులు తెలిపారు. వీటిని ప్రభుత్వానికి ఉచితంగా మేఘా ఇంజనీరింగ్ సంస్థ ఇవ్వనుంది. వీటి ద్వారా ఆక్సిజన్ కష్టాలను తీరే అవకాశం ఉంది. ప్రస్తుతం, భవిష్యత్తులో ఆక్సిజన్ కొరత నివారణే లక్ష్యంగా మేఘా ఇంజనీరింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఒక్కొక్కటి 7వేల లీటర్లు గల ఆక్సిజన్‌ సిలిండర్లను ప్రతి రోజు కనీసం పది ఆస్పత్రులకు ఉచితంగా సరఫరా చేస్తోంది. ఇప్పటి వరకు 4,242 సిలిండర్లను వివిధ ఆస్పత్రులకు సరఫరా చేశారు. ఆస్పత్రులకు ఆక్సిజన్‌ను అందించేందుకు మేఘా ఇంజనీరింగ్ కార్పొరేషన్ (మెయిల్) ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. ఇందుకు  తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్‌ ఆధ్వర్యంలో ఏర్పడిన సలహా కమిటీకి చెందిన సీనియర్‌ అధికారుల బృందం పర్యవేక్షిస్తోంది

కాగా, ఆక్సిజన్‌ కొరతను అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం కూడా చర్యలు వేగవంతం చేస్తోంది. విదేశాల నుంచి ఆక్సిజన్‌ను దిగుమతి చేసుకుంటోంది. విమానాలు, రైల్వే మార్గాల ద్వారా భారత్‌కు ఆక్సిజన్‌ సరఫరా జరుగుతోంది. ఆక్సిజన్‌ కొరతను దృష్టిలో ఉంచుకుని ఇతర దేశాలకు కూడా భారత్‌కు అండగా నిలుస్తున్నాయి.  ఆక్సిజన్ కొరత లేకుండా కేంద్ర కూడా ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది.

ఇవీ కూడా చదవండి:

Jackfruit: పనస పండు వల్ల అద్భుతమైన ఉపయోగాలు.. రోగనిరోధక శక్తి పెంచడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయంటున్న నిపుణులు

Diabetic: మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవాలనుకుంటున్నారా..? మీ రోజు వారీ ఆహారంలో వేరుశనగలు జోడించండి..!