Covid Positive: ఉత్తరాఖండ్‌లో పోలీసులను వెంటాడుతున్న కరోనా.. 2300 మందికి పాజిటివ్‌.. 93శాతం వ్యాక్సినేషన్‌

Covid Positive: కరోనా మహమ్మారి చేస్తున్న నష్టం అంతా ఇంతా కాదు. రోజురోజు ఎంతో మంది ప్రాణాలను తీస్తోంది. కరోనా కట్టడికి కేంద్ర రాష్ట్రాలు అనేక చర్యలు చేపడుతున్నాయి...

Covid Positive: ఉత్తరాఖండ్‌లో పోలీసులను వెంటాడుతున్న కరోనా.. 2300 మందికి పాజిటివ్‌.. 93శాతం వ్యాక్సినేషన్‌

Updated on: Jun 03, 2021 | 2:06 PM

Covid Positive: కరోనా మహమ్మారి చేస్తున్న నష్టం అంతా ఇంతా కాదు. రోజురోజు ఎంతో మంది ప్రాణాలను తీస్తోంది. కరోనా కట్టడికి కేంద్ర రాష్ట్రాలు అనేక చర్యలు చేపడుతున్నాయి. ఇక ఉత్తరాఖండ్‌లో కూడా కరోనా మహమ్మారి తీవ్రంగానే ఉంది. ఆ రాష్ట్ర పోలీసు విభాగంలో మొత్తం 2,300 మంది పోలీసులకు కరోనా పాజిటివ్‌ అని తేలింది. పోలీసులతో పాటు వారి కుటుంబ సభ్యుల్లో 751 మందికి కరోనా పాజిటివ్ రాగా, కరోనా వైరస్ కారణంగా ఐదుగురు జవాన్లు, వారి కుటుంబ సభ్యుల్లో 64 మంది ప్రాణాలు మరణించారు.

కరోనా కట్టడికి విధి నిర్వహణలో భాగంగా ఉన్న పోలీసులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఉత్తరాఖండ్ పోలీసుల్లో 93 శాతం మందికి కోవిడ్‌ రెండు మోతాదుల వ్యాక్సిన్ తీసుకున్నారు. వ్యాక్సిన్ తీసుకున్న వారిలో కోవిడ్‌ పాజిటివ్ సంఖ్య గణనీయంగా తగ్గింది. ఇక కరోనా రోగులకు ఆక్సిజన్, పడకలు, ప్లాస్మా అందించడానికి గత నెలలో ఉత్తరాఖండ్ పోలీసులు మిషన్ హౌస్లా అనే ప్రత్యేక డ్రైవ్ ను ప్రారంభించారు.

ప్రజలకు రేషన్, అంబులెన్సులు అందించడం, మృతదేహాలను దహనం చేయడంలో పోలీసులు ప్రజలకు సహకరించారు. మిషన్ హౌస్లా ప్రాజెక్టు కింద ప్రజల నుంచి 31,815 ఫోన్ కాల్స్ రాగా, పోలీసులు 2,726 మందికి ఆక్సిజన్ సిలిండర్లు, 792 మంది ఆసుపత్రుల్లో పడకలు, 217 మందికి ప్లాస్మా, రక్తదానం చేశారు. ఉత్తరాఖండ్ పోలీసులు 17,609 మందికి మందులు తీసుకోవడానికి సహాయం చేశారు. రేషన్, పాలు, వండిన ఆహారాన్ని 94,484 మందికి అందించారు. 492 మంది కోవిడ్‌ మృతులకు దహన సంస్కారాలు సైతం చేశారు. మొదటి దశ కరోనా వేవ్ లో 1982 మంది పోలీసులకు కరోనా పాజిటివ్ అని తేలగా 8 మంది మరణించారు. ఇలా తమ కుటుంబాలను పట్టించుకోకుండా ప్రజలకు ఎల్లవేళల సహకరిస్తున్న పోలీసులు ప్రాణాలు పోతున్నారు. ఒక వైపు వ్యాక్సినేషన్‌ కొనసాగుతుంటే..మరో వైపు కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. కొన్ని రోజుల నుంచి దేశంలో పాజిటివ్‌ కేసులు, మరణాల తగ్గుఖం పట్టింది.

ఇవీ కూాడా చదవండి:

మహిళా ఎంపీకి పార్లమెంట్‌లో చేదు అనుభవం.. ప్యాంట్‌ ధరించి వచ్చినందుకు సభకు అనుమతించని స్పీకర్‌

Corona Cases India: దేశంలో కొత్తగా మరో 1.34 లక్షల పాజిటివ్ కేసులు, 2887 మరణాలు..

Loading...
Unable to load recommendations.
Follow Us