షాకింగ్ న్యూస్.. దేశంలో ప్రతి 12 నిమిషాలకు ఓ రేప్..!

| Edited By:

Mar 20, 2020 | 6:02 PM

నిర్భయ చట్టం ఉన్నా.. దిశ చట్టం వచ్చినా.. కామాంధుల తీరులో మాత్రం మార్పులేదు. నిత్యం దేశంలో ఎక్కడో ఓ చోట అత్యాచార ఘటనలు జరగుతునే ఉన్నాయి. తాజాగా నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో తెలిపిన లెక్కలు చూస్తే షాక్ తినాల్సిందే. ఆ రికార్డులను చూస్తే దేశంలో ఇన్ని ఘటనలు జరగుతున్నాయా అని నోరు తెరవాల్సిందే. గత 2014-18 మధ్య కాలంలో.. దేశ వ్యాప్తంగా నమోదైన అత్యాచార కేసులు మొత్తం 1.75 లక్షల కేసులు నమోదయ్యాయి. ఈ విషయాన్నిస్వయంగా […]

షాకింగ్ న్యూస్.. దేశంలో ప్రతి 12 నిమిషాలకు ఓ రేప్..!
Follow us on

నిర్భయ చట్టం ఉన్నా.. దిశ చట్టం వచ్చినా.. కామాంధుల తీరులో మాత్రం మార్పులేదు. నిత్యం దేశంలో ఎక్కడో ఓ చోట అత్యాచార ఘటనలు జరగుతునే ఉన్నాయి. తాజాగా నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో తెలిపిన లెక్కలు చూస్తే షాక్ తినాల్సిందే. ఆ రికార్డులను చూస్తే దేశంలో ఇన్ని ఘటనలు జరగుతున్నాయా అని నోరు తెరవాల్సిందే.
గత 2014-18 మధ్య కాలంలో.. దేశ వ్యాప్తంగా నమోదైన అత్యాచార కేసులు మొత్తం 1.75 లక్షల కేసులు నమోదయ్యాయి. ఈ విషయాన్నిస్వయంగా కేంద్రహోం మంత్రిత్వ శాఖ పరిధిలోని నేషనల్‌ క్రైం రికార్డ్స్‌ బ్యూరో (NCRB)వెల్లడించింది. ఈ నివేదికల ప్రకారం.. ఐదేళ్ల కాలంలో మొత్తం 1,75,695 కేసులు నమోదయ్యాయి. వీటిలో 2014లో 36,739 కేసులు ఫైల్ అవ్వగా.. 2015లో 34,094 కేసులు నమోదయ్యాయి.
ఇక 2016లో అత్యధికంగా 38,739 రేప్ కేసులు నమోదయ్యారు. 2017లో 32,559 కేసులు, 2018లో 33,356 కేసులు రికార్డయ్యాయి. ఇందులో అత్యధికంగా మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో నమోదయ్యాయి. ఇక్కడ 25,259 అత్యాచార కేసులఉ నమోదయ్యాయి. ఆ తరువాతి స్థానాల్లో యూపీ, రాజస్థాన్‌, మహారాష్ట్రలు నిలిచాయి.
దీన్ని బట్టి చూస్తుంటే దేశంలో ప్రతి పన్నెండు నుంచి పదిహేను నిమిషాలకు ఓ రేప్ కేసు నమోదవుతున్నట్లు తెలుస్తోంది.