Jharkhand: దారుణం.. టెకీ ఉద్యోగిపై గ్యాంగ్ రేప్.. ఫ్రెండ్‌‌తో కలిసి వెళ్తుండగా ఏం జరిగిందంటే..?

|

Oct 23, 2022 | 1:05 PM

నిర్భయ లాంటి కఠిన చట్టాలున్నప్పటికీ.. దేశంలో అత్యాచర సంఘటనలు రిపీట్‌ అవుతూనే ఉన్నాయి. చిన్నారులు, మహిళలపై కామాంధులు రెచ్చిపోతున్నారు.

Jharkhand: దారుణం.. టెకీ ఉద్యోగిపై గ్యాంగ్ రేప్.. ఫ్రెండ్‌‌తో కలిసి వెళ్తుండగా ఏం జరిగిందంటే..?
Representative Image
Follow us on

నిర్భయ లాంటి కఠిన చట్టాలున్నప్పటికీ.. దేశంలో అత్యాచర సంఘటనలు రిపీట్‌ అవుతూనే ఉన్నాయి. చిన్నారులు, మహిళలపై కామాంధులు రెచ్చిపోతున్నారు. పసిమొగ్గలను సైతం తమ పైశాచికత్వంతో తుంచేస్తున్నారు. తాజాగా ఝార్ఖండ్‌లో మరో యువతి కామాంధులకు బలైపోయింది. స్నేహితులతో కలిసి సరదాగా గడుపుదామని వెళ్లిన ఓ మహిళా సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌.. సామూహిక అత్యాచారానికి గురైంది. అక్టోబరు 20న జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ ప్రముఖ ఐటీ సంస్థలో బాధితురాలు వర్క్‌ ఫ్రం హోం చేస్తోంది. అక్టోబరు 20న సాయంత్రం తన స్నేహితుడితో కలిసి స్కూటీపై చాయీబాసా శివారులోని విమానాశ్రయ ప్రాంతానికి వెళ్లింది.

ఈ క్రమంలో జంటను గమనించి అక్కడికి పదిమంది యువకులు వచ్చారు. ఆమె స్నేహితుణ్ని చితకబాది, దుండగులు యువతిని లాక్కెళ్లిపోయారు. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి పది మంది దుండగులు యువతిపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. యువతి అపస్మారక స్థితికి చేరుకోవడంతో.. ఆమె పర్సులోని నగదు, మొబైల్‌ ఫోను తీసుకొని పరారయ్యారు.

ఆ తరువాత అపస్మారక స్థితినుంచి తేరుకున్న బాధితురాలు ఇంటికి వెళ్లి జరిగిన దారుణాన్ని కుటుంబసభ్యులకు చెప్పింది. అనంతరం కటుంబ సభ్యులతో కలిసి యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, ఈ ఘటనలో 12 మంది అనుమానితులను విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

కాగా.. ఈ ఘటన జార్ఖండ్ రాష్ట్రంలో కలకలం రేపింది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని.. స్థానికులు, ప్రజా సంఘాలు, పలు పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం..