High Court: ‘రోజూ పలుమార్లు దేవుడిని ప్రార్ధిస్తున్నాడని అత్యాచార కేసులో ఖైదీకి ఉరి శిక్ష రద్దు’.. హైకోర్టు విచిత్ర తీర్పు

ఒడిశా హైకోర్టు తాజాగా సంచలన తీర్పు వెలువరించింది. ఆరేళ్ల బాలికపై హత్యాచారం కేసులో దోషిగా తేలిన ఓ ఖైదీకి మరణశిక్షను రద్దు చేసింది. అందుకు కోర్టు తెలిపిన కారణం విన్న ప్రతి ఒక్కరూ ముక్కున వేలేసుకుంటున్నారు. అసలేం జరిగిందంటే.. ఎస్‌కే ఆసిఫ్‌ అలీ (36) అనే వ్యక్తి ఆరేళ్ల బాలికను 2014లో అత్యాచారం చేసి, హత్య చేశాడు. ఈ కేసులో ఒడిశాలోని జగత్‌సింగ్‌పుర్‌లో ఉన్న పోక్సో కోర్టు మరణశిక్ష..

High Court: 'రోజూ పలుమార్లు దేవుడిని ప్రార్ధిస్తున్నాడని అత్యాచార కేసులో ఖైదీకి ఉరి శిక్ష రద్దు'.. హైకోర్టు విచిత్ర తీర్పు
High Court
Follow us

|

Updated on: Jul 02, 2024 | 9:32 PM

ఒడిశా, జులై 2: ఒడిశా హైకోర్టు తాజాగా సంచలన తీర్పు వెలువరించింది. ఆరేళ్ల బాలికపై హత్యాచారం కేసులో దోషిగా తేలిన ఓ ఖైదీకి మరణశిక్షను రద్దు చేసింది. అందుకు కోర్టు తెలిపిన కారణం విన్న ప్రతి ఒక్కరూ ముక్కున వేలేసుకుంటున్నారు. అసలేం జరిగిందంటే.. ఎస్‌కే ఆసిఫ్‌ అలీ (36) అనే వ్యక్తి ఆరేళ్ల బాలికను 2014లో అత్యాచారం చేసి, హత్య చేశాడు. ఈ కేసులో ఒడిశాలోని జగత్‌సింగ్‌పుర్‌లో ఉన్న పోక్సో కోర్టు మరణశిక్ష విధించింది. అయితే తాజాగా ఈ కేసును విచారించిన హైకోర్టు అతడికి విధించిన మరణశిక్షను జీవిత ఖైదుగా మార్చింది. ఇందుకు సంబంధించి జూన్‌ 27న 106 పేజీల తీర్పును హైకోర్టు ఇచ్చింది. తీర్పు సమయంలో ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో దోషిగా తేలిన ఆసిఫ్‌ అలీ రోజూ దేవుణ్ని ప్రార్థిస్తున్నాడు. రోజులో ఎన్నోసార్లు నమాజ్‌ చేస్తున్నాడు. అతడు దేవుడి ముందు లొంగిపోయాడు. తాను చేసిన నేరాన్ని అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకే అతడికి విధించిన మరణశిక్షను జీవితఖైదుగా మారుస్తున్నామని తీర్పు సమయంలో హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది.

అలాగే బాధిత బాలిక కుటుంబానికి రూ.1.50 లక్షల నష్ట పరిహారం ఇవ్వాలని పోక్సో కోర్టు ఆదేశించగా దాన్ని సవరించిన కోర్టు రూ.10 లక్షలు అందించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. తీర్పును రచించిన జస్టిస్ సాహూ.. అలీ మరణశిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మార్చడానికి అదనపు కారణాలనూ జోడించారు. నిందితుడికి 63 యేళ్ల వయసున్న వృద్ధ తల్లి, ఇద్దరు అవివాహిత సోదరీమణులు ఉన్నారని.. వారంతా అతనిపైనే ఆధారపడ్డారని, అతని కుటుంబ ఆర్ధికపరిస్థితి ఏమాత్రం బాగాలేదని వ్యాఖ్యానించింది. పైగా జైలులోనూ అతను సత్ర్పవర్తనతో ఉన్నాడని సమర్ధించింది. ఈ మేరకు ట్రయల్ కోర్టులో SK సాహూ, RK పట్నాయక్‌లతో కూడిన డివిజన్ బెంచ్ తీర్పును వెలువరించింది.

దీంతో హైకోర్టు తీర్పును ప్రతి ఒక్కరూ తప్పుబడుతున్నారు. ఒక ఖైదీ రోజుకు పలుసార్లు నమాజ్ చేసినంత మాత్రాన మరణశిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా ఎలా మార్చుతారంటూ పలువరు న్యాయవాదులు ప్రశ్నిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

పట్టిస్తే వారికి రివార్డు.. వందరోజుల్లో కట్టడికి యాక్షన్ ప్లాన్
పట్టిస్తే వారికి రివార్డు.. వందరోజుల్లో కట్టడికి యాక్షన్ ప్లాన్
అందరి చూపు దేవర వైపు.. ఆసక్తి రేపుతున్న తారక్ సినిమా.!
అందరి చూపు దేవర వైపు.. ఆసక్తి రేపుతున్న తారక్ సినిమా.!
లాంచింగ్‌కు సిద్ధమైన హానర్‌ కొత్త ఫోన్‌.. కళ్లు చెదిరే ఫీచర్లతో..
లాంచింగ్‌కు సిద్ధమైన హానర్‌ కొత్త ఫోన్‌.. కళ్లు చెదిరే ఫీచర్లతో..
'జయహో టీమిండియా'.. అశేష జనవాహిని మధ్య రోహిత్ సేన విక్టరీ పరేడ్
'జయహో టీమిండియా'.. అశేష జనవాహిని మధ్య రోహిత్ సేన విక్టరీ పరేడ్
విశాఖలో అమ్మకానికి వేలాది ప్లాట్లు.. కొనేవారు లేక పాట్లు..
విశాఖలో అమ్మకానికి వేలాది ప్లాట్లు.. కొనేవారు లేక పాట్లు..
బాలీవుడ్‌ బాద్షా కి ప్రతిష్టాత్మక అవార్డు. | ఓజి పై మాటలు కామెంట్
బాలీవుడ్‌ బాద్షా కి ప్రతిష్టాత్మక అవార్డు. | ఓజి పై మాటలు కామెంట్
ఏపీ, తెలంగాణలోని స్కూళ్లకు జూలై నెలలో భారీగా సెలవులు..
ఏపీ, తెలంగాణలోని స్కూళ్లకు జూలై నెలలో భారీగా సెలవులు..
రూ. 10 వేలలో స్టన్నింగ్‌ ఫోన్‌.. ప్రారంభమైన సేల్‌..
రూ. 10 వేలలో స్టన్నింగ్‌ ఫోన్‌.. ప్రారంభమైన సేల్‌..
దిశ పచ్చబొట్టు ప్రభాస్‌కు సంబంధించినది కాదా? PD అంటే మీనింగ్ ఇదే
దిశ పచ్చబొట్టు ప్రభాస్‌కు సంబంధించినది కాదా? PD అంటే మీనింగ్ ఇదే
ఏంటి ఇంత పెద్ద షాకిచ్చారు.? మరోసారి మాట మార్చిన నయన్..
ఏంటి ఇంత పెద్ద షాకిచ్చారు.? మరోసారి మాట మార్చిన నయన్..
అంతరిక్షంలోకి ప్రధాని మోదీ.? గగన్‌యాన్‌ మిషన్‌పై ఇస్రో సమాచారం..
అంతరిక్షంలోకి ప్రధాని మోదీ.? గగన్‌యాన్‌ మిషన్‌పై ఇస్రో సమాచారం..
గుడ్ న్యూస్.. కల్కి టికెట్స్ రేట్స్ తగ్గుతున్నాయ్‌..!
గుడ్ న్యూస్.. కల్కి టికెట్స్ రేట్స్ తగ్గుతున్నాయ్‌..!
స్పెర్మ్‌ కౌంట్‌ పెంచే ఆహార పదార్థాలు.. అదిరిపోయే లిస్ట్.
స్పెర్మ్‌ కౌంట్‌ పెంచే ఆహార పదార్థాలు.. అదిరిపోయే లిస్ట్.
కిమ్‌ అరాచకం.. సాంగ్స్ విన్నాడని యువకుడికి బహిరంగ ఉరి.. వీడియో.
కిమ్‌ అరాచకం.. సాంగ్స్ విన్నాడని యువకుడికి బహిరంగ ఉరి.. వీడియో.
ఒక్కసారిగా రోడ్డుపై భారీ మొసలి ప్రత్యక్షం.. వాహనదారులు హడల్‌.!
ఒక్కసారిగా రోడ్డుపై భారీ మొసలి ప్రత్యక్షం.. వాహనదారులు హడల్‌.!
దానికదే గాల్లోకి ఎగిరిన చైనా రాకెట్‌.! పెద్దఎత్తున చెలరేగిన మంటలు
దానికదే గాల్లోకి ఎగిరిన చైనా రాకెట్‌.! పెద్దఎత్తున చెలరేగిన మంటలు
కేసీఆర్‌కు హైకోర్టు షాక్‌.! ఆ పిటిషన్‌ కొట్టివేత..
కేసీఆర్‌కు హైకోర్టు షాక్‌.! ఆ పిటిషన్‌ కొట్టివేత..
కొత్త క్రిమినల్‌ చట్టాల్లోని కీలక నిబంధనలు ఇవే..!
కొత్త క్రిమినల్‌ చట్టాల్లోని కీలక నిబంధనలు ఇవే..!
నడి రోడ్డుపై కుప్పకూలిన విమానం.. వీడియో వైరల్.
నడి రోడ్డుపై కుప్పకూలిన విమానం.. వీడియో వైరల్.
అదృష్టవశాత్తు తప్పిన ముప్పు.! ఊపిరి పీల్చుకున్న శాస్త్రవేత్తలు..
అదృష్టవశాత్తు తప్పిన ముప్పు.! ఊపిరి పీల్చుకున్న శాస్త్రవేత్తలు..