04 July  2024

రోజూ మునక్కాయ తింటే.. 

Narender.Vaitla

మునక్కాయ విటమిన్‌ సి, యాంటీ ఆక్సిడెంట్లకు పెట్టింది పేరు. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఎంతగానో ఉపయోగడపతాయి, వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది.

కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడేవారు మునక్కాయను తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ముఖ్యంగా కిడ్నీల్లో రాళ్లు తొలగిపోతాయి.

హైపర్‌ టెన్షన్‌, బీపీ వంటి సమస్యలకు మునక్కాయ దివ్యౌషధమని చెప్పాలి. ఇందులోని నియాజిమినిన్‌, ఐసోథియోసైనేట్ వంటి బయోయాక్టివ్ కాంపౌండ్స్ ధమనులు గట్టిపడటాన్ని నివారిస్తాయి.

మునక్కాయలో యాంటీ ఆక్సిడెంట్స్‌ పుష్కలంగా ఉంటాయి. ఇవి కళ్లు పొడిబారడం వంటి సమస్యలకు చెక్‌ పెడతాయి. భవిష్యత్తులో వచ్చే కంటి సమస్యలను కూడా దరిచేరనివ్వవు.

వీటిలో లభించే కాల్షియం, ఐరన్‌ ఎముకల్ని దృఢంగా ఉంచడంలో ఉపయోగపడతాయి. కీళ్ల సంబంధిత సమస్యలకు ఎంతగానో ఉపయోగపడుతుంది.

చర్మ సంబంధిత సమస్యలను దూరం చేయడంలో కూడా మునక్కాయ ఉపయోగపడుతుంది. వీటి వల్ల మొటిమలతో పాటు ఇతర చర్మ సంబంధిత సమస్యలు తగ్గుతాయి.

డయాబెటిస్‌ పేషెంట్స్‌కి మునక్కాయ బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా రక్తంలోని గ్లూకోజ్‌ స్థాయిలను అదుపులో ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.