ప్రభాస్ అభిమానులకు మరో గుడ్ న్యూస్.. సలార్ 2 వచ్చేస్తుంది.!

Anil Kumar

04 July 2024

సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. ప్రభాస్‌ హీరోగా తెరకెక్కించిన యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా సలార్‌.

ఎన్నో అపజయాలు ఎదుర్కున్న మన డార్లింగ్ ని ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభాస్ ని మళ్లీ నిలబడేలా చేసింది.

అయితే కేజిఎఫ్ 1, 2 లు ఎంత పెద్ద హిట్ అయ్యాయో అందరికి తెలిసిందే.. ఇక అదే తరహాలో సలార్ కూడా ప్లాన్ చేసారు. 

సలార్ 2 పై ప్రభాస్ అభిమానులకు భారీ అంచనాలు ఉన్నాయి.. తాజాగా కల్కి తో ఇండస్ట్రీ హిట్ అందుకున్న ప్రభా.. 

సలార్ 2 పై అప్డేట్ వచ్చింది. సలార్ కథకు కొనసాగింపుగా 'శౌర్యాంగపర్వం' అనే పేరుతో ఈ సినిమా రూపొందనుంది.

సలార్‌ తెరకెక్కించేటప్పుడే సలార్ 2 సీక్వెల్‌కి సంబంధించి 20 శాతం షూటింగ్‌ పూర్తి చేశారు అంట డైరెక్టర్.

అయితే ఇక ఇప్పుడు ఈ ఇయర్ ఆగస్టు 10 నుంచి శౌర్యాంగపర్వం ఫస్ట్ షెడ్యూల్‌ మొదలు కానుంది అని ఇండస్ట్రీ టాక్.

15 రోజుల పాటు ఈ షెడ్యూల్‌ సాగనుంది. కీలక తారాగణంపై సన్నివేశాలను ప్లాన్‌ చేశారు కెప్టెన్ ప్రశాంత్‌నీల్‌.