మిల్కీ యాక్షన్‌.. మాములుగా లేదుగా. ఇలా ఇదే ఫస్ట్ టైం..

Anil Kumar

04 July 2024

టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు ఎంతో ఫెమస్ అయ్యిన మిల్కీ బ్యూటీ తమన్నా కీ రోల్‌ చేస్తున్న సినిమా 'ఓదెల 2'.

ఈ సినిమాకు సంపత్ నంది దర్శకతం వహిస్తున్న సంగతి తెలిసిందే.! ఈ మధ్య ఓదెల 2 షూటింగ్ తో బిజీ అయ్యారు సంపత్.

మొన్న ఒకసారి ఈ సినిమా గురించి చెప్తూ.. తన టీమ్ మొత్తం.. ఈ సినిమా కోసం ఎంతో కష్టపడుతోందని చెప్పుకొచ్చారు.

ఈ సినిమా డైరెక్టర్ సంపత్‌నంది తన టీమ్‌ వర్క్స్ తో కలిసి.. మధు క్రియేషన్స్ పతాకంపై డి.మధు నిర్మిస్తున్నారు.

ఈ సినిమా సంబంధించిన చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్‌ అవుట్ కట్స్ లో సెట్ వేసి శరవేగంగా జరుగుతోందని సమాచారం.

గతంలో ఓటిటి లో రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ అందుకున్న 'ఓదెల రైల్వేస్టేషన్‌' సినిమా చాలామందికి గుర్తుండి పోయింది.

ఈ సినిమాకి కొనసాగింపుగా రూపొందుతోంది ఈ ఓదెల 2. ప్రస్తుతం యాక్షన్‌ సీక్వెన్స్ ని తెరకెక్కిస్తున్నారు.

ఓదెల 2 లో తమన్నా మునుపెన్నడూ కనపడని లుక్ లో కనిపించబోతుంది. ఈ టైపు మూవీలో మన మిల్కీ చెయ్యడం ఇదే ఫస్ట్ టైం.