
రైతు బిల్లులపై తమ నిరసనను తెలియజేసేందుకు ప్రతిపక్షాలు బుధవారం రాష్ట్రపతితో భేటీ కానున్నాయి. ఈ సాయంత్రం 5 గంటలకు తనను కలిసేందుకు వారికి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అపాయింట్ మెంట్ ఇచ్చారు. అయితే కరోనా వైరస్ ప్రోటోకాల్ ని అనుసరించి కేవలం 5 గురు విపక్ష నేతలు మాత్రమే ఆయనతో భేటీ కాగలుగుతారు. వివాదాస్పదమైన ఈ బిల్లులను ఆమోదించవద్దని, వీటిపై సంతకం చేయరాదని ప్రతిపక్షాలు మొదటినుంచీ రాష్ట్రపతిని కోరుతున్నాయి.