Om Birla: స్పీకర్‌ ఓంబిర్లాపై వీగిపోయిన అవిశ్వాస తీర్మానం

లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లాపై అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. పార్లమెంట్ సమావేశాల వేళ విదేశాలకు వెళ్లడం రాహుల్‌కు అలవాటుగా మారిందని అమిత్‌షా విమర్శించారు. అమిత్‌షా వ్యాఖ్యలపై తీవ్ర నిరసన తెలిపారు విపక్ష ఎంపీలు. విపక్షాల నిరసన మధ్యే ఓటింగ్‌ నిర్వహించారు. అయితే మూజువాణి ఓటుతో తీర్మానం వీగిపోయినట్టు ప్యానెల్‌ స్పీకర్‌ జగదాంబికా పాల్‌ ప్రకటించారు.

Om Birla: స్పీకర్‌ ఓంబిర్లాపై వీగిపోయిన అవిశ్వాస తీర్మానం
No Confidence Motion Against Speaker Om Birla Defeated

Updated on: Mar 11, 2026 | 9:27 PM

లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లాపై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. మూజువాణి ఓటుతో తీర్మానం వీగిపోయినట్టు ప్యానెల్‌ స్పీకర్‌ జగదాంబికా పాల్‌ ప్రకటించారు. ప్రతిపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోవడంతో లోక్‌సభ స్పీకర్‌గా ఓంబిర్లా కొనసాగనున్నారు. గురువారం జరగబోయే సభకు ఓం బిర్లా హాజరుకాబోతున్నారు.. ఆయన అధ్యక్షతనే గురువారం నుంచి సమావేశాలు కూడా కొనసాగనున్నాయి.

అసలు ఏం జరిగింది.
సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా రాహుల్‌గాంధీపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా సెటైర్లు వేశారు. బడ్జెట్‌ సమావేశాలు ఎప్పుడు జరిగినా ఆయన విదేశాలకు వెళ్తారు. మళ్లీ తనకు మాట్లాడేందుకు అవకాశం రాలేదని చెబుతారు. విదేశాల్లో ఉంటే సభలో ఎలా మాట్లాడుతారు. జర్మనీ , ఇంగ్లాండ్‌, సింగపూర్‌లో ఉన్న వ్యక్తి ఇక్కడ ఎలా మాట్లాడుతారు అని అన్నారు. విదేశాల నుంచి సభలో మాట్లాడే అవకాశంలేదని అన్నారు. అదేకాదు ప్రధాని దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి కౌగిలించుకుంటారని.. సభలో కూడా ఫ్లయింగ్‌ కిస్స్‌లు , కన్నుకొట్టడం రాహుల్‌కే చెల్లిందన్నారు. అమిత్‌షా వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం తెలిపారు కాంగ్రెస్‌ ఎంపీలు.. రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు.

అనంతరం అమిత్‌ షా చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ ఎంపీలు తీవ్ర నిరసన తెలిపారు. వెల్‌ లోకి దూసుకొచ్చి స్పీకర్‌ పోడియాన్ని చుట్టుముట్టారు. అయితే విపక్షాల ఆందోళన మధ్యే అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌ నిర్వహించారు. దీంతో మొత్తానికి విపక్షాలు స్పీకర్‌పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది.అయితే సభలో అంతకుముందు కేంద్రంపై తీవ్ర విమర్శలు చేశారు రాహుల్‌. మాట్లాడడానికి సభలో తాను లేచినప్పుడల్లా బీజేపీ ఎంపీలు అడ్డుకున్నారని మండిపడ్డారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us