కోవిడ్-19 సాకుతో క్వశ్చన్ అవర్ రద్దు చేస్తారా ? విపక్షాల ఆగ్రహం

| Edited By: Anil kumar poka

Sep 02, 2020 | 12:44 PM

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయంపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి.  కోవిడ్-19 సాకుతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆరోపించాయి.

కోవిడ్-19 సాకుతో క్వశ్చన్ అవర్ రద్దు చేస్తారా ? విపక్షాల ఆగ్రహం
Follow us on

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయంపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి.  కోవిడ్-19 సాకుతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆరోపించాయి. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్, టీఎంసి ఎంపీ డెరెక్ ఓ బ్రీన్ తమ ట్వీట్లలో ప్రభుత్వ వైఖరిని దుయ్యబడుతూ.. ఎవరిని అడిగి ఈ నిర్ణయం తీసుకున్నారని ప్రశ్నించారు. పార్లమెంటును ప్రభుత్వం ఓ నోటీసు బోర్డు స్థాయికి దిగజార్చిందని, లోక్ సభ మెజారిటీని రబ్బర్ స్టాంప్ లా వినియోగించుకోజూస్తున్నదని శశిథరూర్ అన్నారు. మా ఎంపీలను సురక్షితంగా ఉంచుతున్నామనే నెపంపై  ఈ చర్య తీసుకోవడమేమిటని డెరెక్  ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాన్ని రద్దు చేయడమంటే ప్రభుత్వాన్ని మేం ప్రశ్నలు అడగరాదన్నదేనని  స్పష్టమవుతోందన్నారు.