AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రస్తుత కష్టకాలంలో భారత్‌కు సాయం చేస్తున్న ముస్లిం దేశం..! కానీ, ఆపరేషన్‌ సిందూర్‌ టైమ్‌లో పాక్‌కు..

ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య వారం రోజులుగా జరుగుతున్న దాడుల నేపథ్యంలో, భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధును ప్రారంభించింది. ఈ రెండు దేశాల్లో చిక్కుకున్న వేల మంది భారతీయులను అర్మేనియా ద్వారా ఇరాన్ నుండి, ఈజిప్ట్ సహకారంతో ఇజ్రాయెల్ నుండి సురక్షితంగా తీసుకువస్తున్నారు.

ప్రస్తుత కష్టకాలంలో భారత్‌కు సాయం చేస్తున్న ముస్లిం దేశం..! కానీ, ఆపరేషన్‌ సిందూర్‌ టైమ్‌లో పాక్‌కు..
Pm Modi And Egypt Pm
SN Pasha
|

Updated on: Jun 19, 2025 | 2:35 PM

Share

ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య వారం రోజుల నుంచి దాడులు జరుగుతున్నాయి. ఈ దేశాల మధ్య వివాదం ముదురుతుందే కానీ, తగ్గడం లేదు. ఆ దేశాల్లో ఉండే వారు ప్రమాదంలో ఉన్నారు. ఈ రెండు దేశాలలో కూడా పెద్ద సంఖ్యలో భారతీయులు నివసిస్తున్నారు. దీంతో.. వారిని రక్షించేందుకు భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధును ప్రారంభించింది. ప్రభుత్వం అర్మేనియా దేశం ద్వారా ఇరాన్‌లో చిక్కుకున్న భారతీయులను తిరిగి తీసుకువస్తోంది. అదే సమయంలో ముస్లిం దేశం ఈజిప్ట్ ఇజ్రాయెల్ నుండి భారతీయుల తిరిగి రావడానికి భారత్‌కు సహాయ హస్తం అందించింది. ఇజ్రాయెల్ నుండి ప్రజలను తరలించడంలో భారతదేశానికి సహాయం చేస్తామని ప్రకటించింది. భారతదేశంలోని ఈజిప్టు రాయబారి కమెల్ గలాల్ మాట్లాడుతూ.. ఇజ్రాయెల్ నుండి ప్రజలను తరలించడానికి తమ దేశం భారతదేశానికి సహాయం చేస్తుందని అన్నారు.

ఇజ్రాయెల్-ఈజిప్టు భూ సరిహద్దు భారతీయులను తిరిగి తీసుకురావడానికి ఒక ఎంపిక. ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్‌కు మద్దతు ఈజిప్టు ఇప్పుడు భారత్‌కు సాయం చేస్తుండటంతో మరోసారి ఈ రెండు దేశాల మధ్య స్నేహం బంధం బలపడింది. ఇజ్రాయెల్ నుండి వెళ్లిపోవాలి అనుకునే భారతీయ పౌరులు భూ సరిహద్దును దాటే అవకాశాన్ని పొందవచ్చని టెల్ అవీవ్‌లోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. ఈ ఎంపికను ఎంచుకునే భారతీయులు ఈజిప్ట్, జోర్డాన్‌లకు సమయాన్ని నిర్ధారించి వీసాలు పొందవలసి ఉంటుందని రాయబార కార్యాలయం తెలిపింది. 32,000 కంటే ఎక్కువ మంది భారతీయులు ఇజ్రాయెల్‌లో నివసిస్తున్నారు.

ఆపరేషన్ సిందూర్ పై ప్రశ్నలు

ప్రస్తుతం ఈజిప్ట్ భారతదేశంతో తన సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది. కానీ గత నెలలో భారత్‌ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌పై భారతదేశం తీసుకున్న చర్యలను ప్రశ్నించింది. పాకిస్థాన్‌కు మద్దతుగా మాట్లాడింది. అయితే, భారత సైన్యం ఆపరేషన్ తర్వాత ఎంపీల ప్రతినిధి బృందం ఈజిప్టుకు చేరుకున్నప్పుడు, దాని స్వరం మారిపోయింది. ఉగ్రవాదంపై భారతదేశం అనుసరిస్తున్న విధానాన్ని ఆ దేశం ప్రశంసించింది. ప్రతి రంగంలోనూ భారతదేశంతో ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేసుకుంటామని ఈజిప్టు స్పష్టంగా పేర్కొంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి