PM Modi: మోడీజీ క్రేజే వేరప్పా.. ట్విటర్‌లో అరుదైన ఘనత సాధించిన నరేంద్రుడు..

|

Jul 29, 2021 | 7:47 PM

ప్రధాని నరేంద్రమోడీ ట్విటర్‌లో కీలక మైలురాయి దాటేశారు. ట్విటర్‌లో అత్యధిక ఫాలోవర్లు ఉన్న నేతల్లో ఒకరిగా రికార్డు సృష్టించారు.

PM Modi: మోడీజీ క్రేజే వేరప్పా.. ట్విటర్‌లో అరుదైన ఘనత సాధించిన నరేంద్రుడు..
Narendra Modi’s Twitter Followers
Follow us on

PM Narendra Modi’s Twitter followers: ప్రధాని నరేంద్రమోడీ ట్విటర్‌లో కీలక మైలురాయి దాటేశారు. ట్విటర్‌లో అత్యధిక ఫాలోవర్లు ఉన్న నేతల్లో ఒకరిగా రికార్డు సృష్టించారు. ప్రధాని మోడీని ఫాలో అవుతున్న వారి సంఖ్య బుధవారం నాటికి ఏడుకోట్ల (70 మిలియన్లు) మార్కును దాటింది. ప్రజాదరణ కలిగిన నాయకుల్లో నరేంద్ర మోడీ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు.

గుజరాత్ మఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2009లో నరేంద్ర మోడీ ట్విటర్‌ ఖాతాను ప్రారంభించారు. 2010 నాటికి ఆయన్ను ఫాలో అవుతున్న వారి సంఖ్య లక్షగా ఉంది. పది సంవత్సరాలు అంటే 2020లో ఆ సంఖ్య ఆరు కోట్ల(60 మిలియన్లు)కు చేరింది. తాజాగా ఆ సంఖ్య ఏడు కోట్లను దాటేసింది. అదే సమయంలో కేంద్రమంత్రి అమిత్‌ షా ట్విట్టర్ ఖాతాను 2.63 కోట్లు, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని 1.94 కోట్ల మంది ఫాలో అవుతున్నారు.

Pm Narendra Modi Tweeter

ప్రధాని నరేంద్ర మోడీ సోషల్‌ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో అందరికీ తెలుసు. తరుచూ ఏదో ఒక విషయంపై ఆయన స్పందిస్తూనే ఉంటారు. ఇదే క్రమంలో మోడీ.. ట్విటర్‌ ద్వారా దేశ ప్రజలకు చేరువ అయ్యారు. దేశంలో జరుగుతోన్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి ఎప్పటికప్పుడూ వివరిస్తుంటారు. అంతేకాకుండా సాధారణ విషయాలను కూడా ట్విట్టర్ వేదికగా షేర్ చేస్తుంటారు. ఆయన చూపుతున్న చొరవతో అంతర్జాతీయంగా ప్రజాదరణ చూరగొన్నారని కేంద్రమంత్రి పీయూశ్‌ గోయల్ అన్నారు. ‘మోడీజీ విజన్, నిర్ణయాత్మక చర్యలు ఆయనకున్న ప్రజాదరణను మరింత పెంచుతున్నాయి. ఏడుకోట్ల ఫాలోవర్లను సంపాదించుకొని మరొక మైలురాయి దాటిన ప్రధానికి నా అభినందనలు. మీ నాయకత్వం పట్ల మేం గర్వంగా ఉన్నాం’ అని గోయల్ ట్వీట్ చేశారు.


ఇటీవల కాలంలో కొత్త ఐటీ నిబంధనల విషయంలో ట్విటర్, కేంద్రానికి మధ్య వివాదం రాజుకున్న సంగతి తెలిసిందే. అలాగే రైతుల ఆందోళనల నేపథ్యంలో ఇరువర్గాల మధ్య భేదాభిప్రాయాలు నెలకొన్నాయి. ఆ సమయంలో పలువురు కేంద్రమంత్రులు దేశీయ యాప్‌ ‘కూ’ లో చేరారు. ట్విటర్‌తో పాటు ఈ యాప్‌ను కూడా వాడుతున్నారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన పలు విభాగాలు, ఇండియా పోస్ట్‌, మై గవర్నమెంట్‌, డిజిటల్ ఇండియాలు కూడా కూ యాప్‌లో అందుబాటులో ఉన్నాయి. ప్రధాని మాత్రం కూలో ఇంకా ఖాతా తెరవకపోవడం విశేషం.


Read Also… PM Modi: తెలుగుతో సహా 5 బాషాల్లో ఇంజనీరింగ్ విద్య.. తీపికబురు చెప్పిన ప్రధాని నరేంద్ర మోడీ