‘ హ్యాపీ వరల్డ్ టూరిజం డే ‘.. మోదీపై కాంగ్రెస్ సెటైర్

ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీపై కాంగ్రెస్ పార్టీ తన ట్విట్టర్లో సెటైర్లు పేల్చింది. ‘ హ్యాపీ వరల్డ్ టూరిజం డే ‘ అనే ‘ టైటిల్ ‘ పెట్టి.. ఆయన విదేశీ పర్యటనలకు సంబంధించిన 18 థంబ్ నెయిల్ ఫోటోలను పోస్ట్ చేసింది. మోదీ విమానాలు ఎక్కుతున్నప్పుడు, దిగుతున్నప్పుడు నేతలకు అభివాదం చేస్తున్నప్పటి ఫొటోలివి. 2014 మే నెలలో మోదీ అధికారంలోకి వచ్చినప్పటినుంచి ఈ ఏడాది ఏప్రిల్ వరకు 57 దేశాలకు 92 ట్రిప్పులు […]

 హ్యాపీ వరల్డ్ టూరిజం డే .. మోదీపై కాంగ్రెస్ సెటైర్

Updated on: Sep 27, 2019 | 4:58 PM

ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీపై కాంగ్రెస్ పార్టీ తన ట్విట్టర్లో సెటైర్లు పేల్చింది. ‘ హ్యాపీ వరల్డ్ టూరిజం డే ‘ అనే ‘ టైటిల్ ‘ పెట్టి.. ఆయన విదేశీ పర్యటనలకు సంబంధించిన 18 థంబ్ నెయిల్ ఫోటోలను పోస్ట్ చేసింది. మోదీ విమానాలు ఎక్కుతున్నప్పుడు, దిగుతున్నప్పుడు నేతలకు అభివాదం చేస్తున్నప్పటి ఫొటోలివి. 2014 మే నెలలో మోదీ అధికారంలోకి వచ్చినప్పటినుంచి ఈ ఏడాది ఏప్రిల్ వరకు 57 దేశాలకు 92 ట్రిప్పులు వేశారట. ఇది మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అయిదేళ్ల కాలంలో చేసిన విదేశీ పర్యటనలకన్నా రెండింతలు ఎక్కువని కాంగ్రెస్ పేర్కొంది. కాగా-2014 మే నెలలో మోదీ పవర్ లోకి వఛ్చినప్పటి నుంచి 2018 డిసెంబరు వరకు ఆయన విమాన ప్రయాణాలకు రూ. 2,021 కోట్లు ఖర్చయ్యాయని కేంద్ర మంత్రి వి.కె. సింగ్ గత ఏడాది డిసెంబరులో రాజ్యసభకు తెలిపిన విషయాన్ని ఈ పార్టీ గుర్తు చేసింది. ఆ పర్యటనల్లో 10 దేశాల నుంచి ఇండియాకు భారీగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అందాయని సింగ్ పేర్కొన్న విషయాన్ని కాంగ్రెస్ పెద్దలు దాటవేశారు. అటు-మోడీ ప్రస్తుతం యుఎస్ లో ఉన్నారు.