ఆకాశంలో F-16ల కాపలా.. ఒడిలో బిలియన్ల పెట్టుబడులు.. ప్రధాని మోదీ యూఏఈ పర్యటన సక్సెస్!

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేపట్టిన ఐదు దేశాల సుదీర్ఘ విర్యటనలో భాగంగా యూఏఈ (యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్) సంక్షిప్త పర్యటన భారతదేశానికి వ్యూహాత్మకంగా, ఆర్థికంగా భారీ ప్రయోజనాలను తెచ్చిపెట్టింది. పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు, ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం నెలకొన్న ప్రస్తుత తరుణంలో సాగిన ఈ పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.

ఆకాశంలో F-16ల కాపలా.. ఒడిలో బిలియన్ల పెట్టుబడులు.. ప్రధాని మోదీ యూఏఈ పర్యటన సక్సెస్!
Pm Modi Held Talks With Uae President Sheikh Mohamed Bin Zayed Al Nahyan

Updated on: May 15, 2026 | 4:26 PM

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేపట్టిన ఐదు దేశాల సుదీర్ఘ విర్యటనలో భాగంగా యూఏఈ (యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్) సంక్షిప్త పర్యటన భారతదేశానికి వ్యూహాత్మకంగా, ఆర్థికంగా భారీ ప్రయోజనాలను తెచ్చిపెట్టింది. పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు, ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం నెలకొన్న ప్రస్తుత తరుణంలో సాగిన ఈ పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.

శుక్రవారం (మే 15) అబుదాబి చేరుకున్న ప్రధాని మోదీకి యూఏఈ ప్రభుత్వం కళ్లు చెదిరే రీతిలో అపూర్వ స్వాగతం పలికింది. మోదీ విమానం యూఏఈ గగనతలంలోకి ప్రవేశించగానే ఆ దేశానికి చెందిన F-16 యుద్ధ విమానాలు ఎస్కార్ట్‌గా నిలిచి రక్షణగా అబుదాబి వరకు తోడ్కొని వచ్చాయి. ఎయిర్‌పోర్ట్‌లో ప్రధాని గౌరవ వందనం స్వీకరించగా, అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక రక్షణ భాగస్వామ్య ఫ్రేమ్‌వర్క్‌పై కీలక ఒప్పందం కుదిరింది.

ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు మండుతూ పొరుగు దేశాలైన పాకిస్తాన్, నేపాల్‌లలో తీవ్ర ఆగ్రహానికి కారణమవుతుంటే, భారత్‌లో మాత్రం పరిస్థితి ప్రశాంతంగా ఉంది. దీనికి కారణం భారత్ ముందుచూపుతో తీసుకుంటున్న నిర్ణయాలే. ఒపెక్ (OPEC) కూటమి నుంచి యూఏఈ బయటకు రావడంతో క్రూడాయిల్ ఉత్పత్తిపై పరిమితులు తొలిగాయి. దీనిని అనుకూలంగా మార్చుకుంటూ భారత్ రెండు కీలక ఒప్పందాలు చేసుకుంది. ద్రవీకృత పెట్రోలియం గ్యాస్ (LPG) నిరంతర సరఫరా చేసేలా ఇరు దేశాలు కీలక ఒప్పందం చేసుకున్నాయి. వ్యూహాత్మక పెట్రోలియం నిల్వల (Strategic Petroleum Reserves) పై అవగాహన ఒప్పందం (MoU) కుదుర్చుకుంది. ఆర్థిక రంగాన్ని బలోపేతం చేస్తూ భారత ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఆర్‌బిఎల్ బ్యాంక్, మరియు సమ్మాన్ క్యాపిటల్‌లలో 5 బిలియన్ డాలర్ల సుమారు రూ. 41,000 కోట్లు భారీ పెట్టుబడులు పెట్టేందుకు యూఏఈ అంగీకరించింది. అలాగే వడినార్‌లో షిప్ రిపేర్ క్లస్టర్ ఏర్పాటుకు సంబంధించి మరో MoU కుదిరింది.

ఈ సందర్భంగా యూఏఈపై జరుగుతున్న దాడులను ప్రధాని మోదీ తీవ్రంగా ఖండిస్తూ, చర్చల ద్వారానే పశ్చిమాసియా సమస్యలకు పరిష్కారం లభిస్తుందని స్పష్టం చేశారు. అరేబియా తీరం నుండి ఐరోపాలోని నార్డిక్ దేశాల వరకు సాగే ఈ టూర్‌లో భాగంగా ప్రధాని తదుపరి దశల్లో నెదర్లాండ్స్, 43 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత నార్వే, మరియు స్వీడన్ (గోథెన్‌బర్గ్) లలో పర్యటించనున్నారు. ఇటలీతో రక్షణ బంధాన్ని, స్వీడన్‌తో వాణిజ్యాన్ని, నెదర్లాండ్స్‌తో ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించడమే లక్ష్యంగా ఈ పర్యటన కొనసాగుతోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us