చిన్న తప్పిదం.. భారీ ప్రమాదం.. నీటి ప్రవాహానికి కొట్టుకుపోయిన ట్రక్.. డ్రైవర్ గల్లంతు!

జలవిలయం విరుచుకుపడడంతో ఉత్తర భారతం విలవిల్లాడుతుంది. భారీ వర్షాలు వరదలు ఉత్తరాదిని కుదిపేస్తున్నాయి. ఉప్పొంగుతున్న నదిపై వంతెనను దాటడానికి ప్రయత్నిస్తుండగా ఒక ట్రక్కు నీటి ప్రవాహానికి కొట్టుకుపోయింది. అక్కడ ఉన్న కొంతమంది ఈ భయానక సంఘటనను తమ మొబైల్ ఫోన్లలో బంధించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వేగంగా వైరల్ అవుతోంది.

చిన్న తప్పిదం.. భారీ ప్రమాదం.. నీటి ప్రవాహానికి కొట్టుకుపోయిన ట్రక్.. డ్రైవర్ గల్లంతు!
Truck Crossing Flooded River

Updated on: Aug 26, 2025 | 5:22 PM

జలవిలయం విరుచుకుపడడంతో ఉత్తర భారతం విలవిల్లాడుతుంది. భారీ వర్షాలు వరదలు ఉత్తరాదిని కుదిపేస్తున్నాయి. ఎడారి రాష్ట్రం రాజస్థాన్‌ కూడా వర్షాలు వరదలతో వణికికిపోయింది. ఉత్తరప్రదదేశ్, బీహార్‌, హర్యానా, ఢిల్లీ, హిమాచల్‌ప్రదేశ్‌, జమ్మూకశ్మీర్‌, ఒఢిశా, మహారాష్ట్రలను భారీ వర్షాలు ముంచెత్తాయి.

అటు ఒడిశాలోని సుందర్‌గఢ్ జిల్లాలో వరదలకు సంబంధించిన బాధాకరమైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అక్కడ ఒక ట్రైలర్ ట్రక్ బలమైన నీటి ప్రవాహానికి కొట్టుకుపోయింది. ఈ హృదయ విదారక సంఘటన సహజ్‌బహల్ ప్రాంతంలో జరిగింది. సఫాయ్ నదిపై పొంగిపొర్లుతున్న వంతెనను దాటడానికి ఒక ట్రక్ డ్రైవర్ ప్రయత్నించినప్పుడు ఈ ఘటన జరిగింది.

వైరల్ అవుతున్న ఈ వీడియోలో, నీటి ప్రవాహం ఎంత వేగంగా ఉందో ట్రక్ డ్రైవర్ ఊహించలేకపోయాడు. అయినప్పటికీ ట్రక్ డ్రైవర్ తన ప్రాణాలను పణంగా పెట్టి వంతెనను దాటడానికి ప్రయత్నించాడు. దాని ఫలితం ఘోరం జరిగిపోయింది. మరుసటి క్షణంలోనే బలమైన నీటి ప్రవాహం ట్రక్కును ముంచెత్తింది. ట్రైలర్ ట్రక్ కొద్దిసేపటికే నీటి ప్రవాహానికి కొట్టుకుపోయింది.

వైరల్ వీడియో చూడండిః

స్థానిక మీడియా కథనాల ప్రకారం, సంఘటన జరిగిన సమయంలో ట్రక్కులో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. డ్రైవర్‌ను సుజీత్ ఐంద్‌గా గుర్తించారు. అతను కనిపించడం లేదు. క్లీనర్‌ను స్థానికులు వెంటనే రక్షించారు. గల్లంతైన ట్రక్ డ్రైవర్ కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఈ ఘటనకు సంబంధించి అక్కడ ఉన్న కొందరు వ్యక్తులు ఈ దృశ్యాన్ని తమ మొబైల్ ఫోన్‌లలో రికార్డ్ చేశారు. ఇది కాస్తా ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ సంఘటన గురించి సమాచారం అందిన వెంటనే, పోలీసులు, సహాయక బృందం కూడా సంఘటనా స్థలానికి చేరుకుని, తప్పిపోయిన డ్రైవర్ కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. అయితే, డ్రైవర్ ఆచూకీ ఇంకా లభించలేదని అధికారులు తెలిపారు.

ఉప్పొంగిన నదిని దాటడానికి ప్రయత్నిస్తూ మహీంద్రా SUV కూడా కొట్టుకుపోయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వరదల సమయంలో పొంగిపోర్లే వంతెనలను దాటే ప్రమాదం చేయవద్దని TV9 తమ పాఠకులకు విజ్ఞప్తి చేస్తోంది.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..