AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెళ్లి తరవాత యువకుడితో కూతురు ఎఫైర్.. విషయం తండ్రికి తెలియటంతో దారుణం..

మహారాష్ట్రలో దారుణం చోటు చేసుకుంది. నాందేడ్‌లోని గోలేగావ్‌కి చెందిన వివాహిత సంజీవని లఖన్ భండారే అనే యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ప్రియుడుతో చనువుగా ఉన్న భార్యను భర్త రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. అనంతరం ఆమె తండ్రికి సమాచారం అందించారు. అక్కడకు వచ్చిన తండ్రి పరువు పోయిందన్న బాధతో ..

పెళ్లి తరవాత యువకుడితో కూతురు ఎఫైర్.. విషయం తండ్రికి తెలియటంతో దారుణం..
Father Kill Wife And Lover
Jyothi Gadda
|

Updated on: Aug 26, 2025 | 5:54 PM

Share

మహారాష్ట్రలో దారుణ ఘటన చోటు చేసుకుంది. నాందేడ్‌లోని గోలేగావ్‌లో పరువు హత్య కేసు వెలుగులోకి వచ్చింది. నాందేడ్ జిల్లాలోని ఉమ్రి తాలూకాలోని గోలేగావ్‌లో జంట హత్యల సంఘటన ఆ ప్రాంతం మొత్తాన్ని కుదిపేసింది. 19 ఏళ్ల వివాహిత కుమార్తెను, ఆమె ప్రియుడిని ఆమె తండ్రి దారుణంగా హత్య చేసి, వారిద్దరి మృతదేహాలను ఊరి చివరి బావిలో పడవేశాడు. ఇక్కడ అత్యంత షాకింగ్ విషయం ఏమిటంటే ఈ సంఘటన తర్వాత నిందితుడైన తండ్రి స్వయంగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి జంట హత్యల గురించి పోలీసులకు చెప్పి లొంగిపోయాడు.

మృతులు సంజీవని కమ్లే (19), లఖన్ భండారే (19) గా గుర్తించారు. పోలీసులు, గ్రామస్తుల సహాయంతో సంజీవని మృతదేహాన్ని బావి నుండి బయటకు తీశారు. లఖన్ కోసం గాలింపు రాత్రి వరకు కొనసాగింది. మృతుడు సంజీవని సురానే ఉమ్రి తాలూకాలోని బోర్జున్ని నివాసి. గోలెగావ్, బోర్జున్ని గ్రామాలు రెండూ ఒకదానికొకటి పక్కనే ఉన్నాయి. సంజీవని గోలెగావ్ నివాసి సుధాకర్ కమ్లేను ఒక సంవత్సరం క్రితం ఎంతో ఆర్బాటంగా వివాహం జరిపించారు. కానీ, వివాహానికి ముందు సంజీవని లఖన్ భండారితో ప్రేమలో ఉంది. వివాహం తర్వాత కూడా ఇద్దరూ ఫోన్ ద్వారా టచ్‌లో ఉన్నారు. ఈ క్రమంలోనే సోమవారం సంజీవని అత్తమామలు ఇంట్లో లేనప్పుడు ఆమె లఖన్‌ను ఫోన్‌ చేసి ఇంటికి పిలిపించింది. అంతలోనే ఆమె భర్త, అత్తమామలు తిరిగి వచ్చారు. అప్పుడు వారిద్దరూ అభ్యంతరకరమైన స్థితిలో ఉండటం చూశారు. వెంటనే వారిని బంధించి ఆమె తండ్రికి ఫోన్ చేసి విషయం చెప్పారు.

సంజీవని తండ్రి, తాత వెంటనే కూతురి అత్తమామల ఇంటికి చేరుకున్నారు. కుమార్తెను, ఆమె ప్రేమికుడిని తమతో తీసుకెళ్తుండగా దారుణంగా కొట్టి, ఆపై ఇద్దరినీ హత్య చేశారు. హత్య అనంతరం మృతదేహాలను బావిలో పడేశారు. సోమవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో మారుతి ఉమ్రి పోలీస్ స్టేషన్‌కు చేరుకుని మొత్తం విషయాన్ని ఒప్పుకున్నాడు. సమాచారం అందిన వెంటనే పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సాయంత్రం ఆలస్యంగా సంజీవని మృతదేహాన్ని బయటకు తీశారు. ఆమె ప్రియుడి మృతదేహం ఆచూకీ లభించలేదని తెలిసింది. మృతురాలి తండ్రిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. కాగా, ఈ సంఘటన జిల్లా అంతటా సంచలనం సృష్టించింది. గ్రామంలో భయానక వాతావరణం నెలకొంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..