Odisha Train Accident: హౌరా మార్గంలో పలు రైళ్ల రద్దు.. ఏపీ మీదుగా నడిచే వాటిని కూడా రద్దు చేసిన రైల్వే శాఖ..

|

Jun 07, 2023 | 12:21 PM

ఒడిశా రైలు ప్రమాద ఘటనస్థలి వద్ద రైల్వే ట్రాక్‌ను సరిచేసిన తర్వాత కొన్ని రైళ్లను రైల్వే శాఖ పునరుద్ధరించింది.అయితే హౌరా రూట్‌లో కొన్ని రైళ్ల రద్దు మాత్రం కొనసాగిస్తోంది. మరో మూడు రోజులకు ఈ రైళ్ల రద్దు కొనసాగుతుందని రైల్వే అధికారులు తెలిపారు.  రైలు ప్రమాద ఘటన నేపథ్యంలో ఏపీ మీదుగా నడిచే మరో నాలుగు రైళ్లను బుధవారం (జూన్ 7న)నాడు రద్దు చేసినట్లు రైల్వే అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.

Odisha Train Accident: హౌరా మార్గంలో పలు రైళ్ల రద్దు.. ఏపీ మీదుగా నడిచే వాటిని కూడా రద్దు చేసిన రైల్వే శాఖ..
Trains Cancelled
Follow us on

ఒడిశా రైలు ప్రమాద ఘటనస్థలి వద్ద రైల్వే ట్రాక్‌ను సరిచేసిన తర్వాత కొన్ని రైళ్లను రైల్వే శాఖ పునరుద్ధరించింది.అయితే హౌరా రూట్‌లో కొన్ని రైళ్ల రద్దు మాత్రం కొనసాగిస్తోంది. మరో మూడు రోజులకు ఈ రైళ్ల రద్దు కొనసాగుతుందని రైల్వే అధికారులు తెలిపారు.  రైలు ప్రమాద ఘటన నేపథ్యంలో ఏపీ మీదుగా నడిచే మరో నాలుగు రైళ్లను బుధవారం (జూన్ 7న)నాడు రద్దు చేసినట్లు రైల్వే అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ – షాలిమర్ (రైలు నెంబర్.12842), విల్లుపురం – పురూలియా (రైలు నెంబర్.22606), ఎంజీఆర్ సెంట్రల్ – హౌరా (రైలు నెం.12840), పుదుచ్చేరి – హౌరా (రైలు నెం.12868) రైళ్లను బుధవారంనాడు రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్ రాకేష్ ఓ ప్రకటనలో తెలిపారు.

కాగా మరో మూడు రోజుల పాటు (జూన్ 9 తేదీ) వరకు 20 రైళ్లను రద్దు చేసినట్లు మంగళవారంనాడు ద.మ.రైల్వే అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఇందులో హైదరాబాద్ – షాలిమర్ (రైలు నెం.18046), హౌరా – ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ (రైలు నెం.12839), హౌరా – శ్రీ సత్య సాయి ప్రశాంతి నిలయం (నెం.22831) తదితర రైళ్లు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉండగా ఒడిశా రైలు ప్రమాద ఘటనలో మృతిచెందిన వారు, గాయపడిన వారిని గుర్తించే ప్రయత్నాలను అధికారులు కొనసాగిస్తున్నారు. ఈ వివరాల కోసం భారత రైల్వే హెల్ప్ లైన్ నెంబర్ 139, భువనేశ్వర్ మున్సిపల్ కార్పొరేషన్ హెల్ప్ లైన్ నెంబర్ 18003450061/1929 నెంబర్లకు కాల్ చేయాలని రైల్వే అధికారులు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తలు చదవండి..