
సమాజంలో టెక్నాలజీ రోజురోజుకీ పెరుగుతున్నప్పటికీ కొంతమంది ప్రజలు మాత్రం మూఢనమ్మకాలను విడిచిపెట్టడం లేదు. ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో దుష్టశక్తుల రాకూడదని కొన్ని గిరిజన తెగలవారు తమ పిల్లలకు వీధి కుక్కలతో వివాహం జరిపిస్తుంటారు. తాజాగా అలాంటి ఘటనే మరొకటి జరిగింది. బాలాసోర్ జిల్లా సోరో బ్లాక్ బంద్‌సాహి గ్రామానికి చెందిన 11 ఏళ్ల తపన్ సింగ్ అనే బాలుడికి ఆడ కుక్కనతో పెళ్లి చేశారు. అలాగే ఏడేళ్ల వయసున్న లక్ష్మీ అనే అమ్మాయిని ఓ మగ కుక్కతో వివాహం జరిపించారు.
హో తెగకు చెందిన గిరిజనులు తమ పిల్లల దవడలపై దంతాలు కనిపిస్తే కీడుగా, అశుభంగా భావిస్తారు. కుక్కలతో పిల్లి దుష్ట శక్తులు పారిపోతాయని నమ్ముతారు. కుక్కలతో పెళ్లి జరిపితే ఆ చెడు అంతా కుక్కలకు చేరుతుందని ఆ గిరిజన వాసులు భావిస్తారు. ఈ నమ్మకాలకు ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేకపోయిన.. ఆ మూఢనమ్మకం మాత్రం కొనసాగుతూనే ఉంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం..