Odisha: 20 ఏళ్లలో 50 మందిని పెళ్లి చేసుకున్నాడు.. వయసేమో 55.. సారు కథ నెక్ట్స్ లెవల్..!

అతని వయసు వయసు 55.. అతని మోసానికి బలైన వారు 55 మంది మహిళలు. తన యవసుకు తగిన వారిని, ఒంటరి మహిళలను టార్గెట్‌గా చేసుకుని 20 ఏళ్లుగా మోసాలకు పాల్పడుతున్న ఈ కేటుగాడి ఆటలకు ఎట్టకేలకు చెక్ పడింది. ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదులో గురుగ్రామ్ పోలీసులు అరెస్ట్ చేశారు.

Odisha: 20 ఏళ్లలో 50 మందిని పెళ్లి చేసుకున్నాడు.. వయసేమో 55.. సారు కథ నెక్ట్స్ లెవల్..!
Odisha Cheating

Updated on: Jun 11, 2023 | 3:40 PM

అతని వయసు వయసు 55.. అతని మోసానికి బలైన వారు 55 మంది మహిళలు. తన యవసుకు తగిన వారిని, ఒంటరి మహిళలను టార్గెట్‌గా చేసుకుని 20 ఏళ్లుగా మోసాలకు పాల్పడుతున్న ఈ కేటుగాడి ఆటలకు ఎట్టకేలకు చెక్ పడింది. ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదులో గురుగ్రామ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతని మోసాలకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలను చూస్తే షాకింగ్‌గా ఉన్నాయి. మరి వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.

మ్యాట్రిమోనియల్ వైబ్‌సైట్లే అతనికి ఆధారం.. ఈ సైట్ల ద్వారా 50 మంది మహిళలను మోసం చేసి, లక్షల రూపాయలు వారు వద్ద నుంచి లాగేశాడు. జంషెడ్‌పూర్‌కు చెందిన తపేష్.. 1992లో కోల్‌కతాలో ఓ మహిళను పెళ్లి చేసుకున్నాడు. వారికి ఇద్దరు కుమార్తెలు జన్మించారు. 8 ఏళ్లు బాగానే కాపురం చేశాడు. ఆ తరువాత 2000 సంవత్సరంలో తపేష్ తన భార్య, బిడ్డలను వదిలేసి ఇంటి నుంచి వెళ్లిపోయాడు.

ఇటీవల గురుగ్రామ్‌లో ఓ మహిళ ఫిర్యాదుతో నాడు అదృశ్యమైన వ్యక్తి ఆచూకీ నేడు లభ్యమైంది. మ్యాట్రియోనియల్ వెబ్‌సైట్ ద్వారా పరిచయం అయ్యాడు.. సంప్రదాయబద్దంగా తామిద్దరం పెళ్లి చేసుకున్నామని మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది. అయితే, పెళ్లయిన మూడు రోజులకే తపేష్ సదరు మహిళకు సంబంధించి ఆభరణాలతో సహా రూ. 20 లక్షలు తీసుకుని పారిపోయాడు. ఈ వివరాలన్నీ తన కంప్లైంట్‌లో పేర్కొంది బాధిత మహిళ. ఈ ఫిర్యాదు మేరకు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. నిందితుడు తపేష్‌ను అరెస్ట్ చేశారు.

ఇవి కూడా చదవండి

ఇదిలాఉంటే.. నిందితుడు తపేష్ మరికొంతమందితో కలిసి బెంగళూరులో ‘స్మార్ట్ హైర్ సొల్యూషన్’ పేరుతో జాబ్ ప్లేస్‌మెంట్ ఏజెన్సీని ప్రారంభించాడు. అమాయకులకు ఉద్యోగాల వల విసిరి.. వారి నుంచి డబ్బులు గుంజి మోసానికి పాల్పడ్డాడు. అయితే, ఈ మోసం ఎక్కువ కాలం సాగకపోవడంతో మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్ల ద్వారా మోసాలకు తెరలేపారు. విడాకులు తీసుకుని ఒంటరిగా జీవిస్తున్న స్త్రీలు, వితంతువులు, పెళ్లయిన మహిళతో డేటింగ్ ప్రారంభించాడు తపేష్. మధ్య వయస్కులైన మహిళతో సంబంధాలు పెట్టుకుని మోసాలు చేయడం ప్రారంభించాడు.

నిందితుడు తపేష్ గత 20 ఏళ్లలో 50 మందికి పైగా మహిళలను పెళ్లి పేరుతో మోసం చేశాడని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం నిందితుడిని గురుగ్రామ్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అతనిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..