Tamil Nadu: తానే పార్టీ కోశాధికారినంటూ బ్యాంక్‌కు పన్నీర్‌ సెల్వం లేఖ.. అన్నా డీఎంకేలో పార్టీ నిధులపై మొదలైన రచ్చ..

|

Jul 12, 2022 | 9:16 PM

AIADMK factional feud: అన్నా డీఎంకేలో పార్టీ నిధులపై రచ్చ మొదలైంది. బ్యాంకులో ఉన్న పార్టీ ఫండ్స్‌ను టార్గెట్‌ చేశారు ఓపీఎస్‌. మరోవైపు ఓపీఎస్‌పై పోలీసులకు కంప్లయింట్‌ చేసింది ఈపీఎస్‌ వర్గం.

Tamil Nadu: తానే పార్టీ కోశాధికారినంటూ బ్యాంక్‌కు పన్నీర్‌ సెల్వం లేఖ.. అన్నా డీఎంకేలో పార్టీ నిధులపై మొదలైన రచ్చ..
O Panneerselvam
Follow us on

అన్నా డీఎంకేలో మాజీ సీఎంలు పన్నీర్‌ సెల్వం, పళని స్వామి మధ్య వార్‌ పీక్స్‌కు చేరింది. మొన్నటి పార్టీ జనరల్‌ కౌన్సిల్‌ సమావేశం రణరంగంగా మారడంతో పార్టీ హెడ్‌ క్వార్టర్స్‌కి తాళం వేశారు అధికారులు. పార్టీ కోశాధికారి పదవి నుంచి ఓపీఎస్‌ను తొలగించింది ఈపీఎస్‌ వర్గం. ఓపీఎస్‌ పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా రద్దు చేసింది. అయినా సరే వెనక్కి తగ్గేది లేదంటున్నారు ఓపీఎస్‌. పార్టీ ఫండ్స్‌పై పట్టు బిగించాలని చూస్తున్నారు. పార్టీకి కరూర్‌ వైశ్యా బ్యాంక్‌లో అకౌంట్‌ ఉంది. పార్టీ ఫండ్స్‌ ఉన్న ఆ అకౌంట్‌ను ఆపరేట్‌ చేసేందుకు తనని తప్ప ఎవర్నీ అనుమతించవద్దని బ్యాంక్‌ మేనేజర్‌కు లెటర్‌ రాశారు ఓపీఎస్‌.

పార్టీ ట్రెజరర్‌గా ఇంకా తానే ఉన్నానని, కాబట్టి ఇంకెవరికీ అకౌంట్‌ను ఆపరేట్‌ చేసే అధికారం లేదన్నారు. ఒకవేళ ఎవరినైనా అకౌంట్‌ను ఆపరేట్‌ చేయడానికి అనుమతిస్తే మీరే బాధ్యత వహించాల్సి ఉంటుందని మేనేజర్‌కు స్పష్టం చేశారు. ఎన్నికల కమిషన్‌ రికార్డుల ప్రకారం ఇప్పటికీ పార్టీ ట్రెజరర్‌గా, కోఆర్డినేటర్‌గా తానే ఉన్నానని చెబుతున్నారు ఓపీఎస్‌.

మరోవైపు, ఓపీఎస్‌, ఆయన మద్దతుదారులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు అన్నా డీఎంకే సౌత్‌ చెన్నై జిల్లా కార్యదర్శి అధి రాజారామ్‌. పార్టీ హెడ్‌ క్వార్టర్స్‌ నుంచి డాక్యుమెంట్లు, ఇతర ముఖ్యమైన ఐటెమ్స్‌ను వారు దొంగిలించారన్నారు. జనరల్‌ కౌన్సిల్‌ సమావేశానికి ముందు పార్టీ హెడ్‌ క్వార్టర్స్‌ తలుపులు బద్దలుకొట్టి ఓపీఎస్‌ వర్గం లోపలికి చొరబడింది.

ఈపీఎస్‌ వర్గీయులు కూడా ఆగ్రహంతో లోపలికి చొచ్చుకువచ్చారు. రెండు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. దీంతో పోలీసులు లాఠీచార్జ్‌ చేయాల్సి వచ్చింది. రెవెన్యూ అధికారులు అన్నాడీఎంకే హెడ్‌ క్వార్టర్స్‌కు తాళం వేళారు. ఈ ఘర్షణకు సంబంధించి ఇంతవరకు 14 మందిని అరెస్ట్‌ చేశారు చెన్నై పోలీసులు.

రాజకీయ వార్తల కోసం..