NYKS Recruitment 2021: నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ (NYKS) నిరుద్యోగులకు శుభవార్త ప్రకటించింది. ఈ మేరకు భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. నేషనల్ యూత్ కార్ప్స్ (NYC) ద్వారా దేశవ్యాప్తంగా వాలంటీర్లను నియమాకినికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనిలో భాగంగా దేశవ్యాప్తంగా మొత్తం 13,026 వాలంటీర్ల పోస్టులను భర్తీ చేసేందుకు ఎన్‌వైకేఎస్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ నిన్నటి నుంచి ప్రారంభమైంది. దరఖాస్తు చేయడానికి 2021 ఫిబ్రవరి 20 చివరి తేదీ. 623 నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ కేంద్రాల్లో బ్లాక్‌కు ఇద్దరు చొప్పున వాలంటీర్లను నియమించనున్నారు. ప్రతీ రెండు మండలాలకు ఒక వాలంటీర్ ఉంటారు. వీరితో పాటు ప్రతీ కేంద్రంలో కంప్యూటర్, డాక్యుమెంటేషన్ పని కోసం మరో ఇద్దరు వాలంటీర్లను నియమించనున్నారు. ఇందుకు గౌరవ వేతనం నెలకు రూ.5వేలు ఇస్తారు. ఏడాది పాటే దీని కాంట్రాక్టు ఉంటుంది.
దరఖాస్తు ప్రక్రియ అనంతరం ఇంటర్వ్యూ ద్వారా వాలంటీర్లను ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ సమయంలో నోటిఫికేషన్ గైడ్‌లైన్స్ ప్రకారం.. పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు, అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను nyks.nic.in, nyc.in వెబ్‌సైట్‌లో చూడవచ్చు. ఆన్‌లైన్‌తోపాటు ఆఫ్‌లైన్‌లో కూడా దరఖాస్తు చేయవచ్చు.
గుర్తుంచుకోవాల్సిన విషయాలు..
ఈ పోస్టులకు పదో తరగతి అర్హత.
దరఖాస్తు చేసే అభ్యర్థుల వయసు 2021 ఏప్రిల్ 1 వరకు 18-29 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు చేయడానికి ఫిబ్రవరి 20 చివరి తేదీ.
ఇంటర్వ్యూ- 2021 ఫిబ్రవరి 25 నుంచి 2021 మార్చి 8 మధ్య ఉంటుంది.
మార్చి 5న ఫలితాలను వెల్లడిస్తారు.
Also Read: