కరోనాతో నర్సు మృతి.. పీపీఈ కిట్‌లే కారణమా..!

కరోనా సోకి ఢిల్లీలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేసే అంబిక(46) అనే నర్సు మృతి చెందింది. ఈ నెల 21న సాఫ్దర్‌జంగ్‌ ఆసుపత్రిలో చేరిన ఆమె.

కరోనాతో నర్సు మృతి.. పీపీఈ కిట్‌లే కారణమా..!
Follow us

| Edited By:

Updated on: May 26, 2020 | 11:35 AM

కరోనా సోకి ఢిల్లీలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేసే అంబిక(46) అనే నర్సు మృతి చెందింది. ఈ నెల 21న సాఫ్దర్‌జంగ్‌ ఆసుపత్రిలో చేరిన ఆమె.. చికిత్స పొందుతూ 24న కన్నుమూసింది. ఢిల్లీలో కరోనాతో మృతి చెందిన మొదటి నర్సు అంబిననే. కాగా అంబిక మరణానికి పీపీఈ కిట్‌లే కారణమని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఢిల్లీలోని కర్ల ఆసుపత్రిలో అంబిక పనిచేస్తుండగా.. వాడిన పీపీఈ కిట్‌లనే తిరిగి ధరించడం వలన చనిపోయినట్లు ఆమె తోటి ఉద్యోగులు, కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

దీనిపై కర్ల ఆసుపత్రిలో పనిచేసే సీనియర్ నర్సు మాట్లాడుతూ.. ”ఇక్కడ డాక్టర్లకు కొత్త పీపీఈ కిట్‌లు ఇస్తూ, నర్సులను మాత్రం వాడినవే మళ్లీ వేసుకోమంటున్నారు. ఒకవేళ మేము ఏదైనా అభ్యంతరం వ్యక్తం చేస్తే.. మనం రిస్క్‌లో ఉన్నాం. కచ్చితంగా పీపీఈలను తిరిగి వాడాల్సిందే అని చెబుతున్నారు” అని పేర్కొన్నారు. ఇక అంబికాకు సన్నిహితంగా ఉండే మరో నర్సు మాట్లాడుతూ.. గత వారం తమకు కొత్త పీపీఈ కిట్‌లు ఇవ్వాలంటూ నర్సింగ్‌ ఇన్‌ఛార్జితో అంబిక గొడవ పెట్టుకున్నట్లు తెలిపారు.

ఇక అంబిక మరణంపై ఆమె కుమారుడు అఖిల్ మాట్లాడుతూ.. ”మా అమ్మ ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తూ వచ్చింది. వారం క్రితం నాతో మాట్లాడుతూ ఆసుపత్రిలో వాడిన పీపీఈ కిట్‌లనే వాడమని చెప్తున్నారని, మాస్క్‌లకు సైతం డబ్బులను తీసుకుంటున్నారని తెలిపింది. ఉద్యోగం మానేసి ఇంట్లో ఉండమని నేను మా అమ్మకు సూచించా. కానీ తను నా మాటను వినలేదు. అలానే పనిచేసింది. ఇప్పుడు మాకు దూరంగా వెళ్లిపోయింది” అని అన్నారు. అయితే ఈ ఆరోపణలను ఆసుపత్రి యాజమాన్యం ఖండించింది. ఆసుపత్రి యజమాని డా. ఆర్కే కర్ల మాట్లాడుతూ.. తమ దగ్గర పనిచేసే ఉద్యోగులందరికీ పీపీఈ కిట్లు, హ్యాండ్‌ వాష్‌లు అందుబాటులో ఉంచామని అన్నారు. ఒకవేళ అలా ఏదైనా జరిగిందని నా వరకు వస్తే.. దర్యాప్తు చేయింది, కఠిన చర్యలు తీసుకుంటానని అన్నారు. మరోవైపు ఈ ఘటనపై దర్యాప్తు చేయాలంటూ కేరళలోని పతనందిట్ట ఎంపీ ఆంటో ఆంటోనీ ప్రధాని మోదీకి, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు లేఖ రాశారు. కాగా కేరళకు చెందిన అంబిక ఢిల్లీలో తన 16 ఏళ్ల కుమార్తెతో కలిసి నివసిస్తోంది. ఆమె భర్త మలేషియాలో ఉండగా.. కుమారుడు కేరళలో చదువుకుంటున్నాడు.

Read This Story Also: ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం.. ఆహుతైన 1500 గుడిసెలు..!

Latest Articles
ఛాతీలో నొప్పితో పాటు ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా..? వామ్మో..
ఛాతీలో నొప్పితో పాటు ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా..? వామ్మో..
ఈ వారం ఓటీటీలో 20కు పైగా సినిమాలు, సిరీస్‌లు.. ఫుల్ లిస్ట్ ఇదిగో
ఈ వారం ఓటీటీలో 20కు పైగా సినిమాలు, సిరీస్‌లు.. ఫుల్ లిస్ట్ ఇదిగో
పెదాలు నల్లబడిపోతున్నాయా.. వీటిని పాటిస్తే ఎర్రగా మెరిసిపోతాయి..
పెదాలు నల్లబడిపోతున్నాయా.. వీటిని పాటిస్తే ఎర్రగా మెరిసిపోతాయి..
రెండు సిమ్ కార్డులు వాడుతున్నారా? మీకో షాకింగ్ న్యూస్..
రెండు సిమ్ కార్డులు వాడుతున్నారా? మీకో షాకింగ్ న్యూస్..
మీకు కోపం ఎక్కువా.? అయితే మీకు త్వరలోనే ఈ పెను సమస్య తప్పదు..
మీకు కోపం ఎక్కువా.? అయితే మీకు త్వరలోనే ఈ పెను సమస్య తప్పదు..
బెంగళూరులో నీటి కొరతే కాదు.. ఇప్పుడు 'బీర్‌' కూడా కష్టమే!
బెంగళూరులో నీటి కొరతే కాదు.. ఇప్పుడు 'బీర్‌' కూడా కష్టమే!
42 ఎకరాల్లో అతిపెద్ద విల్లా.. ఫ్రీగా ఇచ్చేస్తున్నారోచ్. త్వరపడండి
42 ఎకరాల్లో అతిపెద్ద విల్లా.. ఫ్రీగా ఇచ్చేస్తున్నారోచ్. త్వరపడండి
ఈ సంకేతాలు మీలో కనిపిస్తే.. బ్రెయిన్ డీటాక్స్ చేయాల్సిందే!
ఈ సంకేతాలు మీలో కనిపిస్తే.. బ్రెయిన్ డీటాక్స్ చేయాల్సిందే!
ఐటీఆర్ ఫైల్ చేయడానికి ఫారం-16 ఎందుకు అవసరం? లేకపోతే ఏమి చేయాలి?
ఐటీఆర్ ఫైల్ చేయడానికి ఫారం-16 ఎందుకు అవసరం? లేకపోతే ఏమి చేయాలి?
రూ. 79,998విలువైన ఫోన్.. కేవలం రూ. 15వేలకే సొంతం చేసుకోండి..
రూ. 79,998విలువైన ఫోన్.. కేవలం రూ. 15వేలకే సొంతం చేసుకోండి..
శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే
శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే
రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!
రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!
అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.
అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.
ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు
ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు
విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!
విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!
మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..
మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..
తలనొప్పిగా ఉందన్నాడు.. మరుక్షణంలోనే ప్రాణాలు కోల్పోయాడు.!
తలనొప్పిగా ఉందన్నాడు.. మరుక్షణంలోనే ప్రాణాలు కోల్పోయాడు.!
గ్యాంగ్‌స్టర్‌ గోల్డీబ్రార్‌ బ్రతికే ఉన్నాడు.! వీడియో..
గ్యాంగ్‌స్టర్‌ గోల్డీబ్రార్‌ బ్రతికే ఉన్నాడు.! వీడియో..
రజనీకాంత్ బయోపిక్ వార్త వైరల్‌.. హీరో ఎవరంటే.!
రజనీకాంత్ బయోపిక్ వార్త వైరల్‌.. హీరో ఎవరంటే.!
16 కేజీలు తగ్గిన రిషబ్‌ పంత్.! కేవలం 5 ml ఆయిల్‌తో వంట..
16 కేజీలు తగ్గిన రిషబ్‌ పంత్.! కేవలం 5 ml ఆయిల్‌తో వంట..