Mind Detox Sings: ఈ సంకేతాలు మీలో కనిపిస్తే.. బ్రెయిన్ డీటాక్స్ చేయాల్సిందే!

ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటేనే ఎలాంటి అనారోగ్య సమస్యలు దరి చేరకుండా ఉంటాయి. ఆరోగ్యంగా ఉండటం అనేది మన చేతుల్లోనే ఉంది. మీ లైఫ్ స్టైల్ విధానంలో మార్పులు చేసినా, ఆహారపు అలవాట్లు మారినా.. మనిషి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. వీటితోనే మానసిక ఆరోగ్యం కూడా ముడి పడి ఉంటుంది. సరైన ఆహారంతోనే మెదడు పని తీరు కూడా ఉంటుంది. మెదడు చురుగ్గా ఉండాలంటే.. బ్రెయిన్‌లోకి వ్యర్థాలు చేరకుండా చూసుకోవాలి. శరీరంలోని కొన్ని భాగాల్ని..

Mind Detox Sings: ఈ సంకేతాలు మీలో కనిపిస్తే.. బ్రెయిన్ డీటాక్స్ చేయాల్సిందే!
Mind Detox Sings
Follow us

|

Updated on: May 06, 2024 | 4:29 PM

ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటేనే ఎలాంటి అనారోగ్య సమస్యలు దరి చేరకుండా ఉంటాయి. ఆరోగ్యంగా ఉండటం అనేది మన చేతుల్లోనే ఉంది. మీ లైఫ్ స్టైల్ విధానంలో మార్పులు చేసినా, ఆహారపు అలవాట్లు మారినా.. మనిషి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. వీటితోనే మానసిక ఆరోగ్యం కూడా ముడి పడి ఉంటుంది. సరైన ఆహారంతోనే మెదడు పని తీరు కూడా ఉంటుంది. మెదడు చురుగ్గా ఉండాలంటే.. బ్రెయిన్‌లోకి వ్యర్థాలు చేరకుండా చూసుకోవాలి. శరీరంలోని కొన్ని భాగాల్ని డీటాక్స్ చేసినట్టు.. బ్రెయిన్‌కి కూడా డీటాక్స్ అనేది అవసరం. ఇప్పుడున్న బిజీ లైఫ్‌లో ఒత్తిడి, ఆందోళన, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. వీటికి అనేక కారణాలు ఉంటాయి. శరీర ఆరోగ్యం క్షీణిస్తే గుర్తించవచ్చు కానీ.. మానసిక ఆరోగ్యం క్షీణిస్తుంటే గుర్తించడం చాలా కష్టం. విచారంగా ఉండటం.. మీ అలవాట్లు అనేవి మారుతూ ఉంటే వెంటనే వైద్యుల్ని సంప్రదించడం అవసరం. ఎలాంటి సంకేతాలు కనిపిస్తే మెదడుకు డీటాక్స్ అవసరమో ఇప్పుడు చూద్దాం.

నెగిటివ్ ఆలోచనలు రావడం:

తరచూ మీకు నెగిటివ్ ఆలోచనలు రావడం, జనంతో మీరు మమేకం అవ్వలేనప్పుడు, ఎవ్వరితోనూ మాట్లాడకుండా ఉండటం, ఎక్కువగా ఒంటరిగా ఉండటం ఉంటే మాత్రం.. మీ బ్రెయిన్‌కి టీటాక్స్ అవసరం. ఇలాంటి సమయాల్లో వైద్యుల్ని సంప్రదించడం అవసరం.

విచారంగా ఉండటం:

కారణం లేకుండా చాలా మంది విచారంగా ఉంటారు. ఎందుకో ఏంటో కూడా తెలీదు. ఎప్పుడు చూసినా ఏదో ఒకటి ఆలోచించడం, కారణం లేకుండా భయ పడటం వంటి సంకేతాలు కనిపిస్తే.. మీ మానసిక ఆరోగ్యం సరిగా లేదని అర్థం చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

ఎక్కువగా ఆలోచించడం:

చాలా మంది ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. ఆలోచించడం మంచిదే.. కానీ చిన్న చిన్న విషయాలకు కూడా ఎక్కువగా ఆలోచించకూడదు. అంతే కాకుండా చాలా మంది స్వతహాగా నిర్ణయాలు కూడా తీసుకోలేరు. తిన ఆహారంపై కూడా కంట్రోల్ కోల్పోతారు. అలాగే అలసటగా ఉండటం, మూడ్ స్వింగ్స్ ఎక్కువగా ఉంటే.. మెంటల్ డీటాక్స్ అవసరం అవుతుంది.

వైద్యుల్ని కలవలేని వారు.. ఇంట్లో కూడా మీ మెదడును డీటాక్స్ చేసుకోవచ్చు. బయట వాతావరణంలో ఎక్కువగా తిరుగుతూ ఉండాలి. ఉదయం వాకింగ్, యోగా, ధ్యానం వంటివి చేయడం వల్ల బ్రెయిన్ డీటాక్స్ అవుతుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Latest Articles
మిడ్‌రేంజ్‌ బడ్జెట్‌లో స్టన్నింగ్ స్మార్ట్ ఫోన్‌.. అదిరిపోయే ఫీచర
మిడ్‌రేంజ్‌ బడ్జెట్‌లో స్టన్నింగ్ స్మార్ట్ ఫోన్‌.. అదిరిపోయే ఫీచర
మెట్రో ప్రయాణికులకు బంపర్‌ ఆఫర్‌.. రూ.100తో రోజంతా ప్రయాణించవచ్చు
మెట్రో ప్రయాణికులకు బంపర్‌ ఆఫర్‌.. రూ.100తో రోజంతా ప్రయాణించవచ్చు
కదులుతున్న బస్సులో చలరేగిన మంటలు.. 9 మంది సజీవ దహనం
కదులుతున్న బస్సులో చలరేగిన మంటలు.. 9 మంది సజీవ దహనం
ఇకపై 17 జిల్లాలే.. 33 కాదు.. జిల్లాలను కుదించే యోచనలో సీఎం రేవంత్
ఇకపై 17 జిల్లాలే.. 33 కాదు.. జిల్లాలను కుదించే యోచనలో సీఎం రేవంత్
మీకు చెవి నొప్పి ఉందా..? ఈ పొరపాట్లు అస్సలు చేయకండి..ప్రమాదమే!
మీకు చెవి నొప్పి ఉందా..? ఈ పొరపాట్లు అస్సలు చేయకండి..ప్రమాదమే!
పోలింగ్ రోజు అల్లర్లపై వేగంగా దర్యాప్తు.. ఈ నియోజకవర్గాల్లో సిట్
పోలింగ్ రోజు అల్లర్లపై వేగంగా దర్యాప్తు.. ఈ నియోజకవర్గాల్లో సిట్
స్టాక్ మార్కెట్ పేరుతో స్కామ్.. రూ. లక్షల్లో టోకరా..
స్టాక్ మార్కెట్ పేరుతో స్కామ్.. రూ. లక్షల్లో టోకరా..
రేపటితో ముగుస్తున్న తెలంగాణ లాసెట్‌ 2024 ఆన్‌లైన్‌ దరఖాస్తులు
రేపటితో ముగుస్తున్న తెలంగాణ లాసెట్‌ 2024 ఆన్‌లైన్‌ దరఖాస్తులు
ఏపీలోని ఈ జిల్లాలకు పిడుగులతో కూడిన వర్షాలు.!
ఏపీలోని ఈ జిల్లాలకు పిడుగులతో కూడిన వర్షాలు.!
జంతువుల నుంచి ఏం నేర్చుకుంటాం అనుకుంటున్నారా.? ఇది తెలుసుకోవాలి
జంతువుల నుంచి ఏం నేర్చుకుంటాం అనుకుంటున్నారా.? ఇది తెలుసుకోవాలి