మెషీన్ లో వేసిన బట్టలు మురికిగా ఉంటున్నాయా.?

TV9 Telugu

06 May 2024

వాషింగ్ మెషీన్ లో వేసిన బట్టలపై అక్కడక్కడ డిటర్జెంట్ అంటుకుని కనిపిస్తుంది. మీకు కూడా ఇలాంటి సమస్య ఎదురైతే మేము మీకు కొన్ని చిట్కాలను చెబుతున్నాము..

తరచుగా లాండ్రీ బ్యాగ్‌లో ఉంచిన బట్టలు మొత్తం ఒకేసారి ఉతకడానికి వాషింగ్ మెషిన్‌లో అన్ని కలిపి వేస్తారు.

కానీ, మీకు తెలుసా..? వివిధ బట్టలు కలిపి వాషింగ్ మెషిన్ లో ఉతకడం వల్ల చాలా సార్లు బట్టలు మురికిగా ఉంటాయి.

గట్టి బట్టలతో మృదువైన బట్టలు ఉతకడం వల్ల అవి పాడైపోయే ప్రమాదం ఉంది. పైగా చిరిగిపోయే ప్రమాదం కూడా ఉంది.

ఎందుకంటే మందమైన బట్టలు ఎక్కువసేపు ఇందులో ఉతకవలసి ఉంటుంది. అయితే మృదువైన బట్టలు మెషిన్ లో త్వరగా ఉతకాలి.

బట్టల తీరుకు అనుగుణంగా మెషీన్‌ ప్రొగ్రామ్‌ని మార్చండి. దీని కారణంగా డిటర్జెంట్ కూడా తక్కువగా అవసరం అవుతుంది. నీరు కూడా తక్కువగా తీసుకుంటుంది.

వాషింగ్ మెషీన్‌లో బట్టలు వేసేటప్పుడు ఎక్కువ మురికి బట్టలు విడిగా, తక్కువ మురికి బట్టలు విడిగా ఉతకాలని గుర్తుంచుకోండి.

కాబట్టి మెషీన్‌ తక్కువ సమయాన్ని కేటాయించండి. అదే సమయంలో ఎక్కువ మురికి బట్టలు ఎక్కువ టైమ్‌త పాటు ఎక్కువ మెషీన్‌ తిప్పడం అవసరం.