Lifestyle: మీకు కోపం ఎక్కువా.? అయితే మీకు త్వరలోనే ఈ పెను సమస్య తప్పదు..

కోపం వచ్చిన సమయంలో శరీరానికి హాని కలిగించే హార్మోన్లు విడుదలవుతాయి. ఇది గుండె కొట్టుకోవడం వేగం, రక్తపోటును పెంచుతుంది అలాగే గుండెకు వెళ్లే రక్తనాళాల లోపలి పొరను దెబ్బతీస్తుంది. ఇది దెబ్బతిన్న రక్తనాళంపై ప్లేట్‌లెట్, లిపిడ్ నిక్షేపణకు కారణమవుతుంది. కాలక్రమేణ ఇది గుండెపోటుకు దారి తీస్తుందని అధ్యయనంలో వెల్లడైంది...

Lifestyle: మీకు కోపం ఎక్కువా.? అయితే మీకు త్వరలోనే ఈ పెను సమస్య తప్పదు..
Angry
Follow us

|

Updated on: May 06, 2024 | 4:47 PM

కోపం… ప్రతీ ఒక్కరికీ వచ్చే సర్వ సాధారణమైన ఎమోషన్‌. అయితే కోపం ఎన్నో రకాల సమస్యలకు కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు. తన కోపమే తన శత్రువు అని చిన్నతనంలో చదువుకున్న పద్యం కచ్చితంగా నిజమే అనిపిస్తోంది. తాజాగా పరిశోధకులు చేపట్టిన అధ్యయనంలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. అమెరికన్‌ హార్ట్ అసోసియేషన్‌ జర్నల్‌లో ప్రచురించిన వివరాల ఆధారంగా కోపంతో ఊగిపోయే వారికి గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉన్నాయని చెబుతున్నారు.

కోపం వచ్చిన సమయంలో శరీరానికి హాని కలిగించే హార్మోన్లు విడుదలవుతాయి. ఇది గుండె కొట్టుకోవడం వేగం, రక్తపోటును పెంచుతుంది అలాగే గుండెకు వెళ్లే రక్తనాళాల లోపలి పొరను దెబ్బతీస్తుంది. ఇది దెబ్బతిన్న రక్తనాళంపై ప్లేట్‌లెట్, లిపిడ్ నిక్షేపణకు కారణమవుతుంది. కాలక్రమేణ ఇది గుండెపోటుకు దారి తీస్తుందని అధ్యయనంలో వెల్లడైంది. కోపం గుండె ఆరోగ్యానికి హాని కలిగించడమే కాకుండా, చిరాకు, అలసట, మానసికంగా దెబ్బతీస్తుందని చెబుతున్నారు.

అలాగే కోపం నిద్ర సమస్యలు, డిప్రెషన్, ఒత్తిడి వంటి ప్రమాదాలను పెంచుతుంది. కోపం కారణంగా మద్యపానం, సిగరెట్, డ్రగ్స్‌కు బానిసలయ్యే అవకాశం పెరుగుతుంది. ఇది కాలక్రమేణ ఆరోగ్యాన్ని పూర్తిగా దెబ్బ తిస్తుందని అంటున్నారు. అందుకే కచ్చితంగా కోపాన్ని అదుపు చేసుకోవాలని సూచిస్తున్నారు. ఇందుకోసం కొన్ని రకాల చిట్కాలను పాటించాలని సూచిస్తున్నారు.

ముఖ్యంగా ప్రతీ రోజూ శ్వాస వ్యాయామాలు చేయాలని చెబుతున్నారు. యోగా, ధ్యానం వంటి వాటిని అలవాటుగా మార్చుకోవాలి. అలాగే ప్రతీరోజూ కచ్చితంగా 8 గంటల నిద్ర ఉండాలి. దీసుకునే ఆహారం విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇక ఒంటరిగా ఉండకుండా నిత్యం నలుగురితో ఉండేలా చూసుకోవాలని చెబుతున్నారు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Latest Articles
సీఎం జగన్ కాన్వాయ్ అడ్డుకున్న ఎన్నారై.. పోలీసులపై వైసీపీ ఆగ్రహం..
సీఎం జగన్ కాన్వాయ్ అడ్డుకున్న ఎన్నారై.. పోలీసులపై వైసీపీ ఆగ్రహం..
కొత్తగా పెళ్లి అయ్యిందా.? గోవాకు హనీమూన్‌ ట్రిప్‌
కొత్తగా పెళ్లి అయ్యిందా.? గోవాకు హనీమూన్‌ ట్రిప్‌
రూ.30 లక్షల హోమ్‌ లోన్‌పై ఎంత ఈఎంఐ చెల్లించాలి?వడ్డీ ఎంత అవుతుంది
రూ.30 లక్షల హోమ్‌ లోన్‌పై ఎంత ఈఎంఐ చెల్లించాలి?వడ్డీ ఎంత అవుతుంది
తెలంగాణ కార్పొరేట్‌ కాలేజీల్లో ఇంటర్‌ 1st ఇయర్‌ ఉచిత ప్రవేశాలు
తెలంగాణ కార్పొరేట్‌ కాలేజీల్లో ఇంటర్‌ 1st ఇయర్‌ ఉచిత ప్రవేశాలు
ఎస్‌బీఐ ఖాతాదారులకు శుభవార్త.. స్వల్పకాలిక ఎఫ్డీలపై వడ్డీ పెంపు..
ఎస్‌బీఐ ఖాతాదారులకు శుభవార్త.. స్వల్పకాలిక ఎఫ్డీలపై వడ్డీ పెంపు..
స్లోగా మారిన ఫోన్‌తో చిరాకు లేస్తుందా.? ఈ ట్రిక్స్‌ ఫాలో అవ్వండి
స్లోగా మారిన ఫోన్‌తో చిరాకు లేస్తుందా.? ఈ ట్రిక్స్‌ ఫాలో అవ్వండి
తెలంగాణ ఈఏపీసెట్‌ 2024 టాప్‌ 10 ర్యాంకర్లు వీరే.. సత్తాచాటిన ఏపీ!
తెలంగాణ ఈఏపీసెట్‌ 2024 టాప్‌ 10 ర్యాంకర్లు వీరే.. సత్తాచాటిన ఏపీ!
భారీగా పెరిగిన రిషి సునక్‌ సంపద.. ఏడాదిలో ఎన్ని కోట్లో తెలుసా?
భారీగా పెరిగిన రిషి సునక్‌ సంపద.. ఏడాదిలో ఎన్ని కోట్లో తెలుసా?
క్రెడిట్ కార్డు బిల్లు ఎప్పుడు కట్టాలో మీరే నిర్ణయించుకోవచ్చు..
క్రెడిట్ కార్డు బిల్లు ఎప్పుడు కట్టాలో మీరే నిర్ణయించుకోవచ్చు..
TSPSC గ్రూప్‌ 4 ఉద్యోగాలకు 1:3 నిష్పత్తిలో ధ్రువపత్రాల పరిశీలన
TSPSC గ్రూప్‌ 4 ఉద్యోగాలకు 1:3 నిష్పత్తిలో ధ్రువపత్రాల పరిశీలన