హిల్ ట్రిప్ కి వెళ్తే బ్యాగులో ఇవి ఉండాల్సిందే..
TV9 Telugu
06 May 2024
ఒకవేళ మీరు భారతదేశంలోని ఏదైనా హిల్ స్టేషన్‌ని సందర్శించాలనుకుంటే కచ్చితంగా కొన్ని వస్తువులను మీ బ్యాగ్‌లో ఉంచుకోవాలి.
ఈ వస్తువులు బ్యాగులో ఉంది పర్యాటన సంతోషంగా ఎలాంటి సమస్యలు లేకుండా జరుగుతుంది. ఆ వస్తువులు ఏంటో తెలుసుకుందాం.
తోలు జాకెట్, స్వెటర్ హిల్ స్టేషన్ వద్ద ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి మీతో ఒక లెదర్ జాకెట్ తీసుకువెళ్లండి.
ఎందుకంటే ఈ జాకెట్ మీ శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది. దీంతో పాటు అదనంగా ఒకటి లేదా రెండు స్వెటర్లను కూడా తీసుకువెళితే మంచిది.
మఫ్లర్ లేదా క్యాప్ చాలా సమయం స్వెటర్లు ధరించడం వల్ల అలర్జీలు వస్తాయి. కాబట్టి మీరు హిల్ స్టేషన్‌కు వెళ్లినప్పుడు మఫ్లర్ లేదా క్యాప్ ఉంటే మంచిది.
అత్యవసర నంబర్లు మీరు వాకింగ్‌కి వెళ్లినప్పుడు ఎమర్జెన్సీ నంబర్లను గుర్తుంచుకోండి. అత్యవసర నంబర్‌లను కచ్చితంగా మీ వద్ద ఉంచుకోవాలి.
కుటుంబ సభ్యులు, స్నేహితులతో ప్రయాణించినప్పుడు కొన్ని సార్లు గాయపడటం జరుగుతుంది. అటువంటి పరిస్థితిలో ప్రథమ చికిత్స కిట్ వెంట ఉంటే చికిత్స చేయవచ్చు.
మీరు ఎక్కడికైనా ప్రయాణం చేయబోతున్నట్లయితే కెమెరాతో పాటు మీతో సెల్ఫీ స్టిక్ తీసుకోవడం మర్చిపోవద్దు. ఒంటరిగా తిరుగుతూ ఉంటె సెల్ఫీ స్కిట్ అవసరమవుతుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి