Corona Vaccine: ప్రికాషన్ డోసు వ్యవధి ఆరు నెలలకు తగ్గింపు.. ఆచరణ అమలయ్యేనా

|

May 03, 2022 | 7:25 PM

కరోనా(Corona) ను నియంత్రంచడంలో టీకాలు అద్భుత పనితీరును ప్రదర్శిస్తున్నాయి. ఇప్పటికే రెండు టీకా డోసులు తీసుకోవాలన్న కేంద్రం.. మరింత మెరుగైన రక్షణ కోసం ప్రికాషన్ డోసు(Precaution Dose) తీసుకోవాలని...

Corona Vaccine: ప్రికాషన్ డోసు వ్యవధి ఆరు నెలలకు తగ్గింపు.. ఆచరణ అమలయ్యేనా
Vaccine
Follow us on

కరోనా(Corona) ను నియంత్రంచడంలో టీకాలు అద్భుత పనితీరును ప్రదర్శిస్తున్నాయి. ఇప్పటికే రెండు టీకా డోసులు తీసుకోవాలన్న కేంద్రం.. మరింత మెరుగైన రక్షణ కోసం ప్రికాషన్ డోసు(Precaution Dose) తీసుకోవాలని సూచించింది. అంతే కాకుండా డోసు తీసుకునేందుకు 9 నెలలు ఉన్న కాలవ్యవధిని ఆరు నెలలకు తగ్గించాలని జాతీయ సాంకేతియ సలహా బృందం యోచిస్తోంది. కొవిడ్ డోస్ కాలవ్యవధి తగ్గింపుపై ఎన్టీఏజీఐ చర్చించేందుకు సిద్ధమైంది. భారతదేశంలో ఈ ఏడాది జనవరి 10న ఆరోగ్య సంరక్షణ, ఫ్రంట్‌లైన్ కార్మికులు, 60 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వారికి ప్రికాషన్ డోస్ టీకాలు వేస్తు్న్నారు. విద్య, ఉపాధి, క్రీడ, వ్యాపారాల కోసం విదేశాలకు వెళ్లే వారికి కొవిడ్-19 వ్యాక్సిన్‌ను ముందస్తుగా అందించాలా వద్దా అనే అంశంపై నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్ (NTAGI) బుధవారం చర్చించనుంది. కొవిడ్-19 వ్యాక్సిన్ రెండో డోస్, ప్రికాషన్ డోస్ మధ్య అంతరాన్ని ప్రస్తుతం తొమ్మిది నెలల నుంచి ఆరు నెలలకు తగ్గించడంపై కూడా సలహా ప్యానెల్ చర్చించే అవకాశం ఉందని అధికారిక వర్గాలు తెలిపాయి.

అంతేకాకుండా.. ఉద్యోగాల కోసం అత్యవసరంగా ప్రయాణించడం, విదేశీ విద్యాసంస్థల్లో అడ్మిషన్ తీసుకోవడం, స్పోర్ట్స్ టోర్నమెంట్‌లలో పాల్గొనడం, ద్వైపాక్షిక, బహుపాక్షిక సమావేశాలలో పాల్గొనే వారి కోసం కొవిడ్ వ్యాక్సిన్‌ ప్రికాషన్ డోసు ఇచ్చేందుకు అనుమతించాలని ఆరోగ్య మంత్రిత్వశాఖకు అనేక ప్రతిపాదనలు వచ్చాయి. ఎన్టీఏజీఐ స్టాండింగ్ టెక్నికల్ సబ్-కమిటీ (STSC) సభ్యులు శుక్రవారం రెండో డోస్, బూస్టర్ మధ్య అంతరాన్ని ఆరు నెలలకు తగ్గించే అంశంపై క్లుప్తంగా చర్చించారు. అయితే ఎటువంటి నిర్ణయానికి రాలేకపోయారని తెలుస్తోంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, ఇతర అంతర్జాతీయ పరిశోధనా సంస్థల అధ్యయనాలు రెండు డోస్‌లతో ప్రాథమిక టీకాలు వేసిన ఆరు నెలల తర్వాత యాంటీబాడీ స్థాయి క్షీణించడం, బూస్టర్ ఇవ్వడం, రోగనిరోధక ప్రతిస్పందనను పెంచుతుందని సూచించినట్లు అధికారిక వర్గాలు వివరించాయి.

18 ఏళ్లు పైబడిన వారు రెండో డోస్ ఇచ్చిన తర్వాత తొమ్మిది నెలలు పూర్తి చేసుకున్న వారు ప్రికాషన్ డోసులు అర్హులు. బుధవారం సమావేశం కానున్న ఎన్‌టీఏజీఐ సిఫారసుల ఆధారంగా వ్యవధి తగ్గింపు అంశంపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. రోగనిరోధకతపై జాతీయ సాంకేతిక సలహా బృందం(ఎన్​టీఏజీఐ) ఏప్రిల్​ 29న సమావేశమై ప్రికాషన్​ డోసు వ్యవధిని తగ్గించాలని ప్రభుత్వానికి ఎన్​టీఏజీఐ ప్రతిపాదించే అవకాశం ఉందని పేర్కొన్నాయి. ఎన్​టీఏజీఐ ప్రతిపాదనల మేరకు తుది నిర్ణయం వెలువడనుందని వివరించాయి.

కరోనా టీకా రెండు డోసులు వేసిన ఆరు నెలల తర్వాత యాంటీబాడీలు తగ్గిపోతున్నట్లు ఐసీఎంఆర్​ సహా ఇతర అంతర్జాతీయ పరిశోధన కేంద్రాలు తేల్చాయి. బూస్టర్​ డోస్​ ఇవ్వటం ద్వారా రోగనిరోధక శక్తి స్పందన మెరుగవుతున్నట్లు పేర్కొన్నాయి. ఏప్రిల్​ 10 నుంచి 18 ఏళ్లు పైబడిన వారందరికీ ప్రికాషన్​ డోస్​ ఇవ్వటం ప్రారంభించింది. ఇప్పటి వరకు 18-59 ఏళ్ల వయసు వారికి 5,17,547 ప్రికాషన్​ డోసులు ఇచ్చారు. అలాగే.. 47,36,567 మంది హెల్త్​కేర్​ వర్కర్లు, 74,47,184 మంది ఫ్రంట్​లైన్​ వర్కర్లు, 1,45,45,595 మంది 60 ఏళ్లు పైబడిన వారు బూస్టర్​ డోస్​ తీసుకున్నారు.

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఇవీచదవండి

Rahul Gandhi Party Video: నైట్‌క్లబ్‌లో రాహల్‌గాంధీ వీడియోపై రాజకీయ రగడ.. జవదేకర్‌ ఫోటోతో కాంగ్రెస్‌ కౌంటర్‌

Rahul Gandhi Visit: ఓయూ చుట్టూ పొలిటికల్ హై ఓల్టేజ్ ఎపిసోడ్.. కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం