NPR Maharashtra: మహారాష్ట్రలో ఎన్‌పీ‌ఆర్ ‘చిచ్ఛు’.. సేనతో కాంగ్రెస్, ఎన్సీపీ ‘తంటా’

NPR Maharashtra: మహారాష్ట్రలో మూడు పార్టీల మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం చిక్కుల్లో పడుతున్నట్టు కనిపిస్తోంది. జాతీయ జనాభా గణన (ఎన్‌పీ‌ఆర్) పై సీఎం ఉద్దవ్ థాక్రే నేతృత్వంలోని శివసేనతో కాంగ్రెస్, ఎన్సీపీ విభేదిస్తున్నాయి. మే 1 నుంచి రాష్ట్రంలో ఎన్‌పీ‌ఆర్‌ని అమలు చేయాలని ఉధ్దవ్ థాక్రే ప్రభుత్వం నిర్ణయించింది. అయితే దీన్ని వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్,  ఎన్సీపీలు.. ఈ అంశంపై అన్ని సంకీర్ణ భాగస్వామ్య పార్టీలతో ఉమ్మడి సమావేశాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఎన్‌పీ‌ఆర్ అన్నది […]

NPR Maharashtra: మహారాష్ట్రలో ఎన్‌పీ‌ఆర్ 'చిచ్ఛు'.. సేనతో కాంగ్రెస్, ఎన్సీపీ 'తంటా'
Follow us
Umakanth Rao

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Feb 16, 2020 | 1:08 PM

NPR Maharashtra: మహారాష్ట్రలో మూడు పార్టీల మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం చిక్కుల్లో పడుతున్నట్టు కనిపిస్తోంది. జాతీయ జనాభా గణన (ఎన్‌పీ‌ఆర్) పై సీఎం ఉద్దవ్ థాక్రే నేతృత్వంలోని శివసేనతో కాంగ్రెస్, ఎన్సీపీ విభేదిస్తున్నాయి. మే 1 నుంచి రాష్ట్రంలో ఎన్‌పీ‌ఆర్‌ని అమలు చేయాలని ఉధ్దవ్ థాక్రే ప్రభుత్వం నిర్ణయించింది. అయితే దీన్ని వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్,  ఎన్సీపీలు.. ఈ అంశంపై అన్ని సంకీర్ణ భాగస్వామ్య పార్టీలతో ఉమ్మడి సమావేశాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఎన్‌పీ‌ఆర్ అన్నది జాతీయ ప్రయోజనకరమైనదని శివసేన అంటోంది. కానీ ఈ అభిప్రాయాన్ని ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు ఖండిస్తున్నాయి. అటు-ఎన్సీపీ అభ్యంతరాలను పట్టించుకోకుండా ఉధ్ధవ్ థాక్రే.. ఎల్గార్ పరిషద్ కేసు (కోరెగావ్-భీమా కేసు) ను ఎన్ఐఏకి అప్పగించడానికి అంగీకరించారు. ఎన్‌పీ‌ఆర్‌ని అప్‌డేట్ చేయడాన్ని ఆపివేయాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ గత జనవరిలోనే తీర్మానించింది. తాము సీఏఏ, ఎన్సీఆర్, ఎన్‌పీ‌ఆర్‌లకు వ్యతిరేకమని, త్వరలో ఇతర పక్షాలతో కలిసి భవిష్యత్ కార్యాచరణను రూపొందిస్తామని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ బాలాసాహెబ్ థోరథ్ తెలిపారు. ఎల్గార్ పరిషద్ కేసును నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీకి అప్పగించడంపై ముఖ్యమంత్రి తన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోలేదని ఎన్సీపీకి చెందిన హోం మంత్రి అనిల్ దేశ్ ముఖ్ చెప్పారు. ఎన్‌పీ‌ఆర్ అమలుపై మూడు పార్టీలు సమావేశం కావలసిన అవసరం ఉందని, ఆ తరువాతే  తుది ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేయాలని ఆయన పేర్కొన్నారు.

అటు-ఎన్‌పీ‌ఆర్, ఎన్నార్సీ అన్నవి వేర్వేరు అంశాలని, జనాభా గణనకు సంబంధించినది కేంద్రం తీసుకున్న నిర్ణయమని సీఎంకు చీఫ్ మీడియా సలహాదారైన హర్ష ప్రధాన్ చెబుతున్నారు. ఈ వ్యవహారమంతా ప్రజలను వేధిస్తున్నట్టే కనిపిస్తోందని ఎన్సీపీ అధికార ప్రతినిధి నవాబ్ మాలిక్ వ్యాఖ్యానించారు.